Comedian Sudhakar: విలక్షణ నటుడు సుధాకర్‌కు ఇష్టమైన కమెడియన్ అతడేనట..
ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు సుధాకర్. ప్రస్తుతంఆయన వయసు మీదపడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కామెడీ తో తనకంటూ ఓ కొత్త ఒరవడి సృష్టించుకున్నారు సుధాకర్.

విలక్షణ నటనతో హీరోగా..కమెడియన్ గా.. ప్రొడ్యూసర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుధాకర్. ఒకప్పుడు ఆయన చేసే కామెడి కోసమే సినిమాకు వెళ్లే వారుకూడా లేకపోలేదు. ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు సుధాకర్. ప్రస్తుతంఆయన వయసు మీదపడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కామెడీ తో తనకంటూ ఓ కొత్త ఒరవడి సృష్టించుకున్నారు సుధాకర్. ఆయన చెప్పిన డైలాగ్స్ లో పితుహు డైలాగ్ ఎంత ఫెమాసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఆయన తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఆయన మరణించారంటూ అసత్య ప్రచారాలు చక్కర్లు కొట్టాయి.
తనకు ఏం కాలేదని ఎంతో సంతోషం గా ఆరోగ్యంగా ఉన్నానని ఆయన ఓ వీడియో ద్వారా అభిమానులకు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధాకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలో తనకు ఏ అవసరమొచ్చిన వెంటనే స్పందించేది చిరంజీవి, జగపతి బాబు అని తెలిపారు సుధాకర్. అలాగే పవన్ కళ్యాణ్ చిరంజీవి తర్వాత తనను అన్నయ్య అని పిలుస్తారని తెలిపారు.
అలాగే సుధాకర్ మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన కమెడియన్ ఎం.ఎస్ నారాయణ అంటే తనకు ఇష్టమని అన్నారు. ఎం.ఎస్ నారాయణ నటన అంటే అలాగే ఆయన కామెడీ టైమింగ్ అంటే ఇష్టమని తెలిపారు సుధాకర్. అలాగే బ్రహ్మానందం గారి కామెడీ ఇష్టమన్నారు. ఇక సుధాకర్ తనయుడు బెన్ని సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడు బెన్ని ఇప్పటికే నటనలో మెళుకువలు కూడా నేర్చుకుంటున్నాడు.Ms Narayana