Colors Swathi: కలర్స్ ప్రోగ్రామ్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది స్వాతి. అందుకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకెంతో గుర్తింపునిచ్చిన ఆ ప్రోగ్రామ్ పేరునే తన ట్యాగ్‌గా మార్చుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత సుబ్రహ్మణ్యపురం, అష్టాచెమ్మా, గోల్కోండ హైస్కూల్, స్వామిరారా, కారర్తికేయ, త్రిపుర తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. మలయాళంలో మోసాయిలే, కుదిర మీనుగళ్, నార్త్ 24 కాతమ్, ఆమెన్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి అక్కడి ఆడియెన్స్‌ను మెప్పించింది. అయితే సినిమా కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. 2018లో ఆమె తన స్నేహితుడు వికాస్ వసును వివాహమాడింది. ఆతర్వాత మళ్లీ సిల్వర్ స్ర్కీన్‌పై దర్శనమివ్వలేదు. ఆ మధ్య మళ్లీ కార్తికేయ సీక్వెల్ తో మళ్లీ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగినా అది ఊహగానాలేనని తేలిపోయింది. అయితే ఎట్టకేలకు సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది స్వాతి.
నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. ఇందులో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా కనిపించనుంది. శ్రీగాంత్ నాగోతి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. భానుమతి అండ్ రామకృష్ణ సినిమాతో ఆకట్టుకున్న క్రిషివ్ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ మేకర్స్ పతాకంపై యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా స్వాతి లుక్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మంజుల ఘట్టమనేని కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. కాగా మంత్ ఆఫ్ మధుతో పాటు ఇడియట్స్, పంచతంత్రం సినిమాల్లోనూ నటిస్తోంది స్వాతి. మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ సొగసరి ఏ మేర ఆకట్టుకుంటుందో.. లెట్స్ వెయిట్ అండ్ సీ..