Megastar Chiranjeevi: చిరు సినిమా పై క్రేజీ అప్డేట్.. విడుదలకు భారీ ప్లాన్ ?.. పవర్‏ఫుల్ రోల్‏లో మెగాస్టార్..

గాడ్‌ ఫాదర్ తరువాత యంగ్‌ డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు చిరు. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ అప్‌డేట్స్‌తో ఆడియన్స్‌లో కొత్త డౌట్స్ రెయిజ్‌ అవుతున్నాయి.

Megastar Chiranjeevi: చిరు సినిమా పై క్రేజీ అప్డేట్.. విడుదలకు భారీ ప్లాన్ ?..  పవర్‏ఫుల్ రోల్‏లో మెగాస్టార్..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 07, 2022 | 9:20 AM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆచార్య సినిమాతో థియేటర్లలో సందడి చేసిన చిరు.. ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్ మూవీస్ షూటింగ్స్‏లలో పాల్గోంటున్నారు. ఇక మెగాస్టార్ నటిస్తోన్న చిత్రాలలో మెగా 154 కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే మెగాస్టార్ నటిస్తోన్న చిత్రాలపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. చిరు నెక్ట్స్ మూవీస్ గురించి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మెగా 154 సినిమా కాస్టింగ్‌ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో కొత్త డౌట్స్ రెయిజ్‌ అవుతున్నాయి.

గాడ్‌ ఫాదర్ తరువాత యంగ్‌ డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు చిరు. ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ అప్‌డేట్స్‌తో ఆడియన్స్‌లో కొత్త డౌట్స్ రెయిజ్‌ అవుతున్నాయి. ఈ సినిమాలో మల్టీ లింగ్యువల్‌ స్టార్స్‌ నటిస్తున్నారన్న వార్తలు వస్తుండటంతో ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్‌ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఫిలిం వర్గాలు. పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘వాల్తేరు వీరయ్య’ అనే ఊరమాస్ టైటిల్‌ను ఫిక్స్ చేయున్నారని గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ కథ కావటంతో తమిళ విలక్షణ నటుడు సముద్ర ఖని, మలయాళ సెన్సేషన్‌ బిజు మీనన్‌ లాంటి స్టార్స్‌ను కీలక పాత్రల కోసం సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్స్‌ చూస్తుంటే ముఠామేస్త్రీ నాటి వింటేజ్ చిరును మరోసారి తెర మీద చూపిస్తారని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి

ఈ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను మల్టీపుల్‌ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్నది నయా అప్‌డేట్‌. మెగాస్టార్‌కు ఆల్రెడీ నేషనల్ ఇమేజ్‌ ఉంది. రీసెంట్‌గా సైరా సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేశారు. అందుకే మరోసారి నేషనల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారట మెగాస్టార్‌. కంటెంట్ పరంగానూ మెగా 154 నేషనల్ అప్పీల్‌ ఉన్న సబ్జెక్టే. ప్రజెంట్ మాస్ యాక్షన్ సినిమాలకు పాన్ ఇండియా ఆడియన్స్ బ్రహ్మారథం పడుతున్నారు. అందుకే వాల్తేరు వీరయ్య యాక్షన్ కూడా నేషనల్ లెవల్‌లో ఉండబోతుందన్న న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి అఫీషియల్‌ క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.