Venu Thotempudi: ఆ కారణాల వల్లే సినిమాలకు దూరంగా ఉన్నానంటున్న వేణు.. రవితేజ మూవీపై ఆసక్తికర కామెంట్స్..
మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వేణు కనిపించనున్నాడు.
స్వయవరం సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi). ఆ తర్వాత చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, చెప్పవే చిరుగాలి, పెళ్లాం ఊరెళితే వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. నటనతో.. కామెడీతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 9 ఏళ్ల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు. మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వేణు కనిపించనున్నాడు. బుధవారం ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా వేణు సోషల్ మీడియా వేదికగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా విశేషాలను పంచుకున్నారు.
వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ.. ” నేను మొదటి ప్రాధాన్యం సినిమాలకే ఇస్తాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నాను. మళ్లీ ఇప్పుడు నటించడం చాలా సంతోషంగా ఉంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాతోపాటు పారా హుషార్ సినిమాలో నటిస్తున్నాను. ముందుగా నాకు ఈ సినిమా దర్శకనిర్మాతలు చాలా సార్లు ఫోన్ చేసి నటించమని అడిగినా ఒప్పుకోలేదు. కానీ.. ఇందులో నటించకపోయిన పర్వాలేదు.. ఓసారి కలుద్దామని డైరెక్టర్ శరత్ మండవ మేసేజ్ చేశారు. అలా ఒకసారి కలిసాను. అప్పుడు నా పాత్ర ఎలా డిజైన్ చేశారో చెప్పారు. క్యారెక్టర్ నచ్చడంతో ఒకే చెప్పాను. అంతకు ముందు చాలా కథలు విన్నాను. ముందు ఇది స్టార్ట్ అయ్యింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మురళీ పాత్రలో నటిస్తున్నాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ఇది పూర్తిగా భిన్నం. ప్రేక్షకులే చెప్పాలి ఎలా నటించానో. ” అంటూ మనసులోని మాటలను బయటపెట్టారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.