Naga Chaitanya: నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు.. ప్రేమ గురించి చెప్పింది మీరే.. నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్..

థాంక్యూ.. నేను ఎక్కువగా ఉపయోగించే పదం కానీ చాలా ముఖ్యమైన చోట ఎన్నిసార్లు చెప్పిన సరిపోదు. నా తదుపరి సినిమా థాంక్యూ ఈ ఆలోచనను ప్రతిబింబిస్తుంది

Naga Chaitanya: నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు.. ప్రేమ గురించి చెప్పింది మీరే.. నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్..
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 07, 2022 | 6:59 AM

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం థాంక్యూ (thank you). ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే చైతూ తన థాంక్యూ సినిమా జర్ని గురించి చెబుతూ.. తన తల్లిదండ్రులు, స్నేహితుడి గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. వారితో కలిసి ఉన్న త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసుకున్నాడు. థాంక్యూ నేను ఎక్కువగా ఉపయోగించే పదం.. నాకు జీవితంలో ఎలా ప్రేమించాలో.. ఎలా ఉండాలో చెప్పినందకు కృతజ్ఞతలు అంటూ తన తల్లిదండ్రుల ఫోటోస్ మాత్రమే కాకుండా తన పెట్ హాష్ కుక్క పిల్ల ఫోటో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇప్పుడు చైతూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

“థాంక్యూ.. నేను ఎక్కువగా ఉపయోగించే పదం కానీ చాలా ముఖ్యమైన చోట ఎన్నిసార్లు చెప్పిన సరిపోదు. నా తదుపరి సినిమా థాంక్యూ ఈ ఆలోచనను ప్రతిబింబిస్తుంది. సినిమా ప్రయాణంలో నన్ను కదిలించిన విషయం ఇదే. నేను ఈ పోస్ట్ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు అంకితం చేస్తున్నాను. వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎప్పటికీ సరిపోదు. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తుల చిత్రాలను పంచుకోవడం మీ అందరికీ ఇష్టం ఉంటుంది కదూ.. అయితే #themagicwordisthankyou ట్యాగ్ చేయండి.

అమ్మ.. నా కోరిక.. ఎప్పుడు నాతోనే ఉండిపోతుంది. అన్ని విధాల బేషరతుగా ఉంటుంది. నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. నాన్న.. నాకు దిశానిర్దేశం చేస్తాడు. నాతోనే ఉండిపోతాడు. ఇక నా స్నేహితుడు హాష్.. ఎలా ప్రేమించాలో..ఎలా ఉండాలో అనుభూతులను కలిగించినందుకు నన్ను మనిషిగా ఉంచినందుకు థాంక్యూ ” అంటూ భావోద్వేగ పోస్ట్ చేశాడు. థాంక్యూ సినిమా జూలై 22న విడుదల కాబోతుంది. ఇందులో రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.