Regina Cassandra: చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన రెజీనా.. ఆ విషయంలో మెగాస్టార్ గ్రేట్ అంటూ..
రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లనువ్వులేని జీవితం, పవర్, రారా.. కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో
ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రెజీనా కసాండ్రా (Regina Cassandra). ఈ మూవీ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లనువ్వులేని జీవితం, పవర్, రారా.. కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. కేవలం గ్లామర్ షోలకే కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి లేడీ ఒరియెంటెడ్ చిత్రాలను చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది ఈ చిన్నది. అటు సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లలోనూ అలరిస్తోంది రెజీనా. తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గోన్న రెజీనా పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
రెజీనా మాట్లాడుతూ.. ” స్కూల్లో క్లాల్ లీడర్ గా ఉన్నాను..ఆ సమయంలో అబ్బాయిలను కొట్టేదాన్ని.. కానీ చాలా మంది నేను డామినేటింగ్ అని చెప్తారు. నా ఫిజిక్ చూసి కూడా అందరూ డామినేటింగ్ అనుకుంటారు. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవిగారు ఈ వయసులో కూడా చాలా తొందరగా డ్యాన్స్ నేర్చుకున్నారు. అలా చేయడం చాలా గొప్ప విషయం.
నాకు పాత్ర నచ్చిందే అందుకోసం ఏదైనా చేస్తాను. 2019లో 2019లో కులుమనాలీలోని ఓ హోటల్‌లో ఐ మాస్క్ ధరించి నిద్రపోయాను. ఆ సమయంలో నా నుదుటిపై ఉన్న వెంట్రుకలను ఎవరో పక్కకు జరిపినట్లు అనిపించింది. దీంతో అలర్ట్ అయ్యి.. మాస్క్ తీసి చూశాను. అయితే అక్కడ ఎవరూ లేరూ అంటూ చెప్పుకొచ్చింది. ” ప్రస్తుతం రెజీనా ‘నేనే నా’, ‘శాకినీ ఢాకినీ’ సినిమాల్లో నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.