Viral Photo: ముద్దులొలుకుతున్న ఈ చిన్నోడు అమ్మాయిల కలల రాకూమారుడు.. అమ్మ ఒడిలో ఉన్న ఈ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తుపట్టండి..

Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్‌ ఫొటోస్‌ ట్రెండ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఫొటోల రూపంలో పంచుకుంటూ మురిసిపోతున్నారు. మఖ్యంగా సినిమా సెలబ్రిటీలు 

Viral Photo: ముద్దులొలుకుతున్న ఈ చిన్నోడు అమ్మాయిల కలల రాకూమారుడు.. అమ్మ ఒడిలో ఉన్న ఈ  హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తుపట్టండి..
Viral Photo
Follow us
Basha Shek

|

Updated on: Jul 07, 2022 | 8:40 AM

Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్‌ ఫొటోస్‌ ట్రెండ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఫొటోల రూపంలో పంచుకుంటూ మురిసిపోతున్నారు. మఖ్యంగా సినిమా సెలబ్రిటీలు  తమ చైల్డ్‌ హుడ్‌ ఫొటోలు తెగ షేర్‌ చేసుకుంటున్నారు. తమ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో గడిపిన అద్భుత క్షణాలను గుర్తుచేసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సినీ పరిశ్రమలోని చాలామంది ప్రముఖులు త్రో బ్యాక్‌ ఫొటోస్‌తో సందడి చేస్తుననారు. తాజాగా మరో హ్యాండ్సమ్‌ హీరో చిన్ననాటి ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పైన ఫొటోను చూశారు కదా..

అమ్మ ఒడిలో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్‌లో హ్యాండ్సమ్‌ హీరో. తాత, తండ్రుల వారసత్వం ఉన్నా తన నటనతో తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. ప్రేమకథా చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్నాడు. అతనెవరో కాదు అక్కినేని అందగాడు నాగచైతన్య. అతను ప్రస్తుతం నటిస్తోన్న తాజా చిత్రం థాంక్యూ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మనం ఫేమ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో చైతూ తన థాంక్యూ సినిమా ప్రయాణం గురించి చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఉన్న త్రో బ్యాక్‌ ఫొటోస్‌ ను పంచుకంటూ ‘ థాంక్యూ నేను ఎక్కువగా ఉపయోగించే పదం.. నాకు జీవితంలో ఎలా ప్రేమించాలో.. ఎలా ఉండాలో చెప్పినందకు కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. చిన్నప్పుడు చైతూ చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..