AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే

అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? ఇటీవల జరిగిన ఓ మీడియా మీట్‌లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక ప్రశ్న వేశారు. దానిపై ఆయన ఏం సమాధానం ఇచ్చారో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే
Allu Arjun Jani Master
Ravi Kiran
|

Updated on: Dec 24, 2024 | 3:17 PM

Share

అల్లు అర్జున్ అరెస్ట్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ అంశంపై నేను ఏం మాట్లాడను. ఎందుకంటే నేనూ ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి, నా కేసు కూడా కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. అటు జైలుకు వెళ్లకముందు, వెళ్లి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది.? అని అడగిన ప్రశ్నకు బాగానే ఉందని సమాధానమిచ్చారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది చదవండి: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే

మరోవైపు సంధ్య థియేటర్ ఘటన రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరగడమే కాదు.. అల్లు అర్జున్‌ను మరిన్ని చిక్కులు పడేస్తోంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ మాట్లాడటం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇవాళ విచారణకు హాజరైన అల్లు అర్జున్‌ను.. పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. సుమారు మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా.. తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బన్నీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి