Pushpa 2: ‘సినిమాలను వదిలేయాలనుకుంటున్నా’! సుకుమార్ షాకింగ్ కామెంట్స్.. కారణమదేనా?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే ఈ గ్రాండ్ సక్సెస్ ను పుష్ప2 చిత్ర బృందం ఆస్వాదించలేకపోతోంది. దానికి కారణమేం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడం, పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరడంతో హీరో అల్లు అర్జున్ అనుకోకుండా ఇబ్బందుల్లో పడ్డాడు. దీనికి తోడు ఈ ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ మధ్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై పరోక్షంగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా ఈ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి పుష్ప 2 సక్సెస్ ను ఈ వివాదం కప్పేసింది. ప్రస్తుతం ఈ ఘటన సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈలోగా చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ సుకుమార. ఇది విని చాలా మంది షాక్ అవుతున్నారు. సుకుమార్ మాటలకు పక్కనే ఉన్న రామ్ చరణ్ కూడా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఇటీవల అమెరికాలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలోలే ‘ధోప్’ లిరిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ధోప్’ అనగా వదిలేయడం అని అర్థమట.
ఇదే విషయం గురించి యాంకర్ సుమ మాట్లాడుతూ.. ‘ సుకుమార్ గారు ఒకవేళ మీరు ‘ధోప్’ అని వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు? అని అడగ్గా, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ కూడా షాకయ్యాడు. ఆ తర్వాత అలా మాత్రం చేయరులే అని సైగ చేసి చూపించాడు. బహుశా ప్రస్తుత పరిస్థితుల వల్ల సుకుమార్ బాగా డిస్ట్రబ్ అయినట్లు ఉంది. బహుశా అందుకే అలా అన్నాడేమోనని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
అల్లు అర్జున్, సుకుమార్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వివాదాల్లో చిక్కుకోవడం సుకుమార్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోది. ఈ కష్టాల నుంచి అల్లు అర్జున్ త్వరగా బయటపడాలని డైరెక్టర్ సుకుమార్ కోరుకుంటున్నారు.
నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..
Papam ra SUKKU 😢 Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK
— Negan (@Negan_000) December 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.