Megastar Chiranjeevi : మేనల్లుడి హెల్త్ ఆప్డేట్ ఇచ్చిన మెగాస్టార్.. మీ ఆశీస్సులు కావాలంటూ ట్వీట్..
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. వినాయక చవితి రోజున రోడ్డు ప్రమాదానికి గురై అపోలోలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని..
Chiranjeevi : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. వినాయక చవితి రోజున రోడ్డు ప్రమాదానికి గురై అపోలోలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు తెలుగు ప్రేక్షకులు ప్రార్ధనలు చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. రోడ్డు పై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‌ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో తేజ్ షోల్డర్ బోన్ విరగడంతో సర్జరీ చేశారు అపోలో వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు మెగాస్టార్.
చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఈ వార్త తెలియజేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ ఆశీస్సులు రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందిస్తారని ఆశిస్తూ.. ఆ చిత్రయూనిట్ అందరికి నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన ఎక్సిబిషన్ సెక్టార్‌కి రిపబ్లికి చిత్ర విజయం కోలుకోవడానికి కావాల్సినంత దైర్యం ఇస్తుందని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. అలాగే సంగీత దర్శకుడు తమన్ కూడా ట్విట్టర్ ద్వారా .. అపోలో లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని.. మన ప్రార్ధనలు ఫలిస్తున్నాయని తెలిపారు.. ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని అన్నారు తమన్. అలాగే త్వరలో తేజ్‌ను కలవనున్నట్టు తెలిపారు తమన్. నా మిత్రుడిని కలవడానికి చాలా ఆసక్తికి ఎదురుచూస్తున్నా.. త్వరలోనే సాయి ని కలుస్తా అంటూ ట్వీటర్ ద్వార తెలిపారు తమన్. ఇక డై ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాకు దేవకట్ట దర్శకత్వం వహించారు.
Best Of Luck Team #Republic @IamSaiDharamTej pic.twitter.com/hyZJYy9AfI
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 30, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :