Posani Krishna Murali : దాడులు, బెదిరింపుల వల్ల మా మోరల్స్ ఎక్కడికీ పోవు.. మహా అయితే చంపేస్తారు అంతేగా..
పవన్ కళ్యాణ్ - పోసాని వ్యవహారం రోజు రోజు ముదురుతోంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.. మాటల యుద్ధం చేసుకుంటున్నారు.
Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ – పోసాని వ్యవహారం రోజు రోజు ముదురుతోంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.. మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఈ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో రంగంలోకి దిగిన ఏపీ మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడారు. అనంతరం సీన్ లోకి వచ్చిన పోసాని కృష్ణ మురళి కొంచం ఘాటుగానే స్పందించారు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పోసాని పై విరుచుకుపడ్డారు. అసభ్యకర మెసుజ్లు చేస్తూ రచ్చ చేశారు. దాంతో మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని మరింత రెచ్చిపోయి పవన్ పై విరుచుకుపడ్డారు. ఈ సారి ఏకంగా వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించారు. దాంతో పవన్ ఫ్యాన్స్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. పోసాని పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా పోసాని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.
అమీర్‌పేట్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని ఇంటిపై రాత్రి 2 గంటల ప్రాంతంలో దుండగులు రాళ్లు విసిరారు. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ దాడిలో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోసాని ఇంటి వాచ్‌మెన్ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. దీని పై పోసాని స్పందిస్తూ.. తన ఇంటిపై రాళ్లదాడి చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులేనని ఆరోపించారు. ఏం జరిగినా తనకైతే ఎలాంటి భయం లేదని అన్నారు. ”నాకు నచ్చిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు.. నేను చచ్చిపోయే వరకు జగన్ తోనే ఉంటా. గొప్ప ప్రజాసేవకుడైన జగన్ గారిని అరేయ్, ఒరేయ్ అనడం సరికాదు. పవన్ కళ్యాణ్ ఎవ్వరినైనా ఏమైనా అనొచ్చు కానీ ఆయన్ను మాత్రం ఎవ్వరూ ఏమనకూడదు ఇదెక్కడి న్యాయం అన్నారు పోసాని. ఇలాంటి దాడులు, బెదిరింపుల వల్ల మా మోరల్స్ ఎక్కడికీ పోవు. నేనింకా స్ట్రాంగ్ అవుతా. ఇలా రాళ్ల దాడులకు భయపడను. ఇలాంటి దాడులు నేను పవన్‌పై చేయలేనా.? నాకు ఎవ్వడూ అక్కర్లే.. మహా అయితే ఏం చేస్తారు చంపుతారు అంతే కదా. నాయకుడు ఎలా ఉంటాడో కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు ఎవ్వరితో శత్రుత్వం లేదు. ఇప్పుడు పవన్‌ని ప్రశ్నించాను కాబట్టి శత్రువు అయ్యాడు అన్నారు పోసాని.
మరిన్ని ఇక్కడ చదవండి