Telugu Anchor: ఈ ఫోటోలో ఉన్న తెలుగు యాంకర్ ఎవరో గుర్తించారా..?.. మస్త్ యాక్టివ్

సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే.. నెట్టింట వెంటనే వైరల్ అవుతోంది. ఇక వారి చిన్నప్పటి ఫోటోలు అయితే ఓ రేంజ్‌లో సర్కులేట్ అవుతాయి.

Telugu Anchor: ఈ ఫోటోలో ఉన్న తెలుగు యాంకర్ ఎవరో గుర్తించారా..?.. మస్త్ యాక్టివ్
Anchor Ravi
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 30, 2021 | 1:56 PM

తెలుగు టెలివిజన్ ఫీల్డ్‌లో మేల్ యాంకర్ల హవా మొదటి నుంచి తక్కువే. ఎక్కువగా ఫీమేల్ యాంకర్స్ సత్తా చాటుతూ ఉండేవారు.  ఈ క్రమంలో యాంకర్ రవి స్లోగా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాడు. రోజురోజుకు తన మార్క్ చూపిస్తే.. చాలా తక్కువ సమయంలో చాలామంది ఫేవరెట్ అయిపోయాడు. పక్కా మాస్ ఫార్ములా ఫాలో అవుతూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్నాడు.  ఓవైపు యాంకర్ ప్రదీప్ క్లాస్ అయితే.. రవి మాత్రం మాస్ జనాల్ని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రకరకాల టీవీ షోలలో హోస్ట్‌గా చేయడం మాత్రమే కాదు.. ఆడియో పంక్షన్లలో కూడా యాంకర్‌గా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ యాంకర్ బిగ్ బిస్ ఇంట్లో ఉన్నాడు. అతని ఫాలోవర్స్ రవిని విన్నర్‌ని చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తాజాగా రవికి సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది. రవి సోదరి బర్త్ డే సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ రవి అఫిషియల్ ఇన్‌స్టా హ్యాండిల్ నుంచి ఓ పోస్ట్ వేశారు. అందులో రవి, అతని సోదరి చిన్నప్పటి ఫోటో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోను రవి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోకు ఇప్పటికే 60 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ క్రమంలో యాంకర్ రవి సోదరికి చాలామంది బర్త్ డే విషెస్ తెలిపారు. మరికొందరు రవి బిగ్ బాస్ ఇంట్లో బాగా ఆడుతున్నాడంటూ కితాబిస్తున్నారు.

Also Read: సీఐకి హిజ్రాల సన్మానం.. రీజన్ తెలిస్తే మీరు కూడా ఆయనకు సెల్యూట్ చేస్తారు

‘మణికే మాగే హితే’ సాంగ్ పాడిన రాను మోండల్.. ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్..