Ranu Mondal: ‘మణికే మాగే హితే’ సాంగ్ పాడిన రాను మోండల్.. ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్..
రాను మోండల్.. ఈ పేరు ఒకప్పుడు ఇంటర్నెట్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. 2019లో ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ సాంగ్ పాడి రాను మోండల్ ఊహించని విధంగా పాపులర్ అయ్యింది.
రాను మోండల్.. ఈ పేరు ఒకప్పుడు ఇంటర్నెట్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. 2019లో ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ సాంగ్ పాడి రాను మోండల్ ఊహించని విధంగా పాపులర్ అయ్యింది. బెంగాల్‌లోని రణఘాట్ వీధుల్లో ఆమె పాడిన పాట విపరీతంగా ట్రెండ్ అయ్యింది. దీంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ పాటతో ఈమెకు సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ సింగర్‌గా ఆమె కెరీర్ సాఫీగా ముందుకు సాగలేదు. ఆ తర్వాత అప్పుడప్పుడు వార్తల్లో నిలిచిన ఈమె.. తాజాగా మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఇటీవల కాలంలో ‘మణికే మాగే హితే’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ , సోషల్ మీడియా వేదికల్లో ఈ సాంగ్ మారుమోగిపోతోంది. హస్కీ వాయిస్‌తో యోహాని డి సిల్వా అనే శ్రీలంకకు చెందిన ర్యాపర్ పాడిన ఈ పాట.. శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాటలోని భావం ఎవరికీ అర్థం కాకపోయినప్పటికీ.. ఆమె వాయిస్‌లోని మ్యాజిక్, అందుకు అనుగుణంగా ఆమె కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ సాంగ్‌ను బ్లాక్‌బాస్టర్ హిట్ అయ్యేలా చేశాయి. ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్‌ను ఈ సాంగ్ ఇంప్రెస్ చేసింది. తాజాగా ఇదే పాటను రాను మోండల్ ఆలపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. విపరీతంగా సర్కులేట్ అవుతోంది. రాను మోండల్ వాయిస్‌కు జనాలు ఫిదా అవుతున్నారు. ఆమె చాలా చక్కగా పాడిందని కితాబిస్తున్నారు.
Also Read: సీఐకి హిజ్రాల సన్మానం.. రీజన్ తెలిస్తే మీరు కూడా ఆయనకు సెల్యూట్ చేస్తారు
ఈ ఫోటోలో ఉంది నటుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కుర్రకారు మెచ్చే నటి.. గుర్తుపట్టండి