ఈ ఫోటోలో ఉంది నటుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కుర్రకారు మెచ్చే నటి.. గుర్తుపట్టండి

ప్రోస్థటిక్​ మేకప్​ ద్వారా నటీనటులు ఊహించని విధంగా మారిపోతున్నారు. మేకప్ ప్రాసెస్ చాలా కష్టతరమైనప్పటికీ... పాత్రల కోసం యాక్టర్స్ వెనకాడటం లేదు.

ఈ ఫోటోలో ఉంది నటుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కుర్రకారు మెచ్చే నటి.. గుర్తుపట్టండి
Divya Agarwal
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 30, 2021 | 7:18 AM

బిగ్​బాస్​​ ఓటీటీ విన్నర్​ దివ్యా అగర్వాల్​ మరోసారి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ఆమె పోస్ట్​ చేసిన ఓ వీడియో చూసి ఖంగుతిన్నారు. దీనిని చూసిన ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దివ్యా అగర్వాల్ తాజాగా ‘కార్టెల్’​ అనే ఓ వెబ్​ షో కోసం వర్క్ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ప్రోస్థటిక్​ మేకప్​ ద్వారా ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారింది. వృద్ధుడి గెటప్‌లో ఫాలోవర్స్‌ను షాక్‌కు గురయ్యేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఓరేంజ్‌లో లైక్స్ కొడుతూ​, కామెంట్స్​ పెడుతున్నారు. ఆ మేకప్​ కోసం కదలకుండా కుర్చీలో అంత సేపు ఆమె కూర్చోవడం.. ఆ రోల్‌ను ఎంచుకోవడం.. చూస్తే ఆమెకు వృత్తిపై ఉన్న నిబద్దత ఏంటో తెలుస్తుందంటున్నారు ఫ్యాన్స్. దర్శకనిర్మాత ఏక్తా కపూర్​ కూడా ఆమెను ప్రశంసించారు. భవిష్యత్​లో మరిన్నిసార్లు తామిద్దరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కరణ్​ జోహర్​ హోస్ట్‌గా చేసిన బిగ్​బాస్​ ఓటీటీ షోలో దివ్యా అగర్వాల్​ విన్నర్‌గా నిలిచింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్​లో ట్రోఫీని సొంతం చేసుకోవడం సహా రూ.25లక్షల ప్రైజ్​మనీని గెలుచుకుంది. దివ్యా అగర్వాల్ నటి మాత్రమే కాదు.. మోడల్​, డ్యాన్సర్ కూడా​. ఎమ్​టీవీ ఇండియా నిర్వహించిన పలు రియాలిటీ షోల్లో పాల్గొన్ని ఆమె పాపులారిటి పెంచుకుంది. రాగిని ఎమ్​ఎమ్​ఎస్​: రిటర్న్స్​ 2 హారర్​ వెబ్​సిరీస్​తో నటనలోకి అడుగుపెట్టింది. ఎన్నో మ్యూజిక్​ ఆల్బమ్స్​తోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘కార్టెల్’​ వెబ్​సిరీస్​లో నటిస్తోంది.

Also Read: భార్య, అత్తమామ వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న అల్లుడు..

 మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో పీఎం-పోషణ్‌ పథకం..