Hotel Death: వ్యాపారవేత్త మృతి కేసులో మరో ట్విస్ట్‌.. పోలీసులపై కేసు వద్దంటూ జిల్లా అధికారుల సంప్రదింపులు.. వీడియో వైరల్..

Kanpur businessman's death case: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పోలీసుల రెయిడ్‌‌‌‌‌‌‌‌లో ఒక వ్యాపారవేత్త మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి ఓ హోటల్‌లో జరిగిన ఈ సంఘటన కలకలం

Hotel Death: వ్యాపారవేత్త మృతి కేసులో మరో ట్విస్ట్‌.. పోలీసులపై కేసు వద్దంటూ జిల్లా అధికారుల సంప్రదింపులు.. వీడియో వైరల్..
Police
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 30, 2021 | 1:28 PM

Kanpur businessman’s death case: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పోలీసుల రెయిడ్‌‌‌‌‌‌‌‌లో ఒక వ్యాపారవేత్త మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి ఓ హోటల్‌లో జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో యూపీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్.. ఆరుగురు పోలీసులపై వేటు వేసింది. ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. కాన్పూర్‌కు చెందిన మనీశ్ కుమార్ గుప్తా వేరే వ్యక్తిని కలిసేందుకు గోరఖ్‌పూర్‌కు వెళ్లి హోటల్ లో ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో హోటల్‌పై దాడులు నిర్వహించారు. దాదాపు 50 మందికి పైగా పోలీసులు దాడి చేసినట్లు మనీశ్‌ కుమార్‌తో ఉన్న స్నేహితులు వెల్లడించారు. పోలీసుల దాడితోనే అతను చనిపోయినట్లు హర్యానాకు చెందిన గురుగ్రాంకు చెందన మనీశ్‌కుమార్‌ హర్వీర్ సింగ్ తెలిపారు. అయితే.. ఈ సంఘటన అనంతరం పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో యోగి సర్కార్‌ ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది.

ఈ తరుణంలో వ్యాపారవేత్త మరణం కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. పోలీసులపై మర్డర్‌ కేసు నమోదు కావడంతో.. స్వయంగా అధికారులే ఈ కేసు రాజీకి రంగంలోకి దిగి కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరిపారు. కోర్టుకు వెళితే.. కొన్నేళ్ల విచారణ జరుగుతుందని.. ఏం కాదంటూ స్వయంగా జిల్లా మెజిస్ట్రేట్‌ కుటుంబసభ్యులతో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ఒక అన్నయ్యలా అభ్యర్థిస్తున్నానని.. కేసు తర్వాత విచారణ కొన్ని సంవత్సరాలు పడుతుందంటూ జిల్లా మేజిస్ట్రేట్ విజయ్ కరణ్ ఆనంద్ బాధిత కుటుంబానికి చెప్పడాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియో జిల్లా పోలీసు అధికారి కూడా ఉన్నారు. కాగా.. ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసి యోగి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా.. ఈ ఘటన అనంతరం తన భర్తను పోలీసులే చంపారంటూ మనీష్ గుప్తా భార్య మీనాక్షి ఆరోపించారు. కేసును కప్పిపుచ్చాడనికి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంఏశారు.

వీడియో.. 

Also Read:

Crime News: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం.. మరో ఇద్దరు..

Crime News: కృష్ణా జిల్లాలో దారుణం.. 4నెలల పసికందు హత్య.. గొంతునులిమి..