Crime News: కృష్ణా జిల్లాలో దారుణం.. 4నెలల పసికందు హత్య.. గొంతునులిమి..

Krishna Distirct Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని దారుణం చోటుచేసుకుంది. నాలుగు నెలల పసికందును మేనమామ దారుణంగా దారుణంగా చంపాడు. గొంతు నులిమి

Crime News: కృష్ణా జిల్లాలో దారుణం.. 4నెలల పసికందు హత్య.. గొంతునులిమి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 30, 2021 | 11:16 AM

Krishna Distirct Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని దారుణం చోటుచేసుకుంది. నాలుగు నెలల పసికందును మేనమామ దారుణంగా దారుణంగా చంపాడు. గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ సంఘటన జిల్లాలోని రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చోటుచేసుకుంది. పసికందును వరసకు మేనమామ అయ్యే వ్యక్తి.. గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన అనంతరం కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడా..? లేదా కుటుంబసభ్యుల మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రెడ్డిగూడెం పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Crime News: అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించారు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Mega Brothers: తూర్పుగోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ పర్యటనలు.. భారీ ఏర్పాట్లు చేస్తోన్న ఫ్యాన్స్

PM-Poshan Scheme: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రీ ప్రైమరీ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం