Crime News: అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించారు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Woman and her lover paraded naked: దేశంలో నేరాలను అదుపుచేసేందుకు చాలా చట్టాలున్నప్పటికీ.. కొందరు సాటి వారితో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌

Crime News: అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించారు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 30, 2021 | 8:58 AM

Woman and her lover paraded naked: దేశంలో నేరాలను అదుపుచేసేందుకు చాలా చట్టాలున్నప్పటికీ.. కొందరు సాటి వారితో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జార్ఖండ్‌ రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే కారణంతో ఓ మహిళ, పురుషుడిని నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి 60 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసినట్లు ముఫ్ఫసిల్ పోలీసులు తెలిపారు.

దుమ్కా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్కా జిల్లా ముఫ్ఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడ్తల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే.. ఆమె భర్త ఓ నేరం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కుల్హాడియా గ్రామానికి చెందిన మరో యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కలిసి కూలీ పనులకు వెళ్తుండేవారు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ క్రమంలో.. యువకుడు మంగళవారం మయూర్నచ గ్రామంలోని మహిళ ఇంటికి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు.. ఇద్దరిని ఇంట్లో బంధించారు. అనంతరం వారిద్దరినీ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. కిలోమీటరు మేర గ్రామం మొత్తం తిప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం 60 మంది గ్రామస్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

AP Crime News: భార్య, అత్తమామ వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న అల్లుడు..

West Bengal Bypolls: బెంగాల్‌లో ప్రారంభమైన ఉప ఎన్నికల పోలింగ్‌.. పోటీలో సీఎం మమతా బెనర్జీ