AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం.. మరో ఇద్దరు..

Meghalaya Accident: మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు

Crime News: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం.. మరో ఇద్దరు..
Meghalaya Accident
Shaik Madar Saheb
|

Updated on: Sep 30, 2021 | 11:38 AM

Share

Meghalaya Accident: మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు నీటిలో గల్లంతు కాగా.. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మేఘాలయలోని నోంగ్‌చ్రామ్‌ సమీపంలో జరిగింది. బుధవారం అర్థరాత్రి తురా నుంచి షిల్లాంగ్ నగరానికి వెళుతున్న బస్సు.. ప్రమాదవశాత్తు నోంగ్‌చ్రామ్‌లోని రింగ్ది నదిలో పడిపోయింది. వంతనపైనుంచి నీటిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు నలుగరు ప్రయాణికులు మరణించారని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు గల్లంతైనట్లు పేర్కొంటున్నారు. కాగా.. ప్రమాదం జరిగిన బస్సులో 22 మంది ప్రయాణికులున్నారని ఈస్ట్ గారో హిల్స్ పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బంది రంగంలోకి దిగి 16 మంది ప్రయాణికులను రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చికత్స అందుతుందని వెల్లడించారు. బస్సులోనుంచి నాలుగు మృతదేహాలను వెలికితీశామని.. మరో రెండు మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మృతుల్లో బస్సు డ్రైవరు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించారు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Crime News: మరో ఘోరం.. యువతిపై గ్యాంగ్ రేప్.. మద్యం తాగించి దారుణంగా..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?