సినీపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య..

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. టీవీసీరియల్ నటి సౌజన్య ఆత్మహత్య చేసుకున్నారు. కన్నడ నటి అయినా సౌజన్య పలు టీవీ సీరియల్స్ తో పాపులర్ అయ్యారు.

సినీపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య..
Soujanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2021 | 5:20 PM

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. టీవీ సీరియల్ నటి సౌజన్య ఆత్మహత్య చేసుకున్నారు. కన్నడ నటి అయినా సౌజన్య పలు టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయ్యారు. ఆమె తన రూమ్‌లో ఆత్మహత్యకు చేసుకున్నారు. ఆమె రూమ్‌లో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. సౌజన్య ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సౌజన్య మరణ వార్తతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. పలువురు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. మరో వైపు  సౌజన్య ఆత్మహత్య పై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరులోని కుంబల్‌గోడులోని తన అపార్ట్‌మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 25 ఏళ్ల సౌజన్య మరణ వార్త విని ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సౌజన్య గదిలో లభించిన సూసైడ్ నోట్ లో తన ఆత్మహత్యకు తానే మాత్రమే కారణమని పేర్కొంది. ఆమె తన తల్లిదండ్రుల నుండి క్షమాపణ కూడా కోరింది. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ, తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో మానసికంగా బాధపడుతున్నాని నోట్‌లో పేర్కొంది. సౌజన్య కొన్ని టెలివిజన్ సీరియల్స్‌తోపాటు పలు సినిమాలలో కూడా నటించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Thaman: మన ప్రార్ధనలు ఫలిస్తున్నాయి.. నా మిత్రుడు కోలుకుంటున్నాడు.. తమన్ ఎమోషనల్ ట్వీట్