Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: చిక్కుల్లో చిక్కుకోకు అంటూనే చిక్కుల్లోకి నెట్టాడు.. బరువు తగ్గినవారే కెప్టెన్సీకి అర్హులు..

బిగ్‏బాస్ సీజన్ 5 నాలుగోవారానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఇంట్లో సభ్యులను ముప్పుతిప్పులు పెడుతున్నాడు బిగ్ బాస్.

Bigg Boss 5 Telugu: చిక్కుల్లో చిక్కుకోకు అంటూనే చిక్కుల్లోకి నెట్టాడు.. బరువు తగ్గినవారే కెప్టెన్సీకి అర్హులు..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 30, 2021 | 1:51 PM

బిగ్‏బాస్ సీజన్ 5 నాలుగోవారానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఇంట్లో సభ్యులను ముప్పుతిప్పులు పెడుతున్నాడు బిగ్ బాస్.. ఫుడ్ కట్ చేసి ఆకలితో అలమటించేలా చేస్తున్నాడు. ఆకలిని తట్టుకోలేక ఇంటి సభ్యులు పడుతున్న అవస్థలు మాములుగా లేవు. నిన్నటి ఎపిసోడ్‏లో ఆకలిని తట్టుకోలేక లోబో చెత్త కవర్లో ఫుడ్ వెతుకునే దారుణ పరిస్థితిని కలిగించాడు బిగ్ బాస్. ఇక హౌస్‏మేట్స్ నిబంధనలు ఉల్లంఘించడంతో కెప్టెన్సీగా ఉన్న జెస్సీని బాధ్యుడిని చేసి పోటీ నుంచి తప్పించాడు బిగ్ బాస్. దీంతో జెస్సీటీంలో ఉన్న కాజల్ కూడా కెప్టెన్సీ పోటీ నుంచి అనర్హురాలు అయ్యిన సంగతి తెలిసిందే. ఇక బరువు కోల్పోయి ఎవరు కెప్టెన్ అవుతారనేది ఈ టాస్క్ ఉద్దేశ్యం. ఇందులో భాగంగా.. ఇంటి సభ్యులను ఓ ఆట ఆడుకుంటున్నాడు బిగ్ బాస్.

తాజాగా ఈరోజు ప్రోమోలో నేటితో టాస్క్ ముగిసినట్టుగా ప్రకటించాడు బిగ్ బాస్. తాజా ప్రోమోలో సారంగదరియా పాటకు చిందులేస్తూ కనిపించారుడ కంటెస్టెంట్స్. ఇక అనంతరం బరువును తగ్గించుకోవడానికి చిక్కు్ల్లో చిక్కుకోకు అనే టాస్క్ పెట్టాడు. అందులో భాగంగా..చిక్కులు పడ్డ తాడులను విడదీస్ ఎదురుగా ఉన్న స్టాండ్ కు పెట్టాలి. ఇక ఆ తర్వాత ఇంటి సభ్యులలో ఎవరు ఎంత బరువు తగ్గారనేది టెస్ట్ చేశారు. అయితే ఇందులో ఎవరు ఎక్కువ బరువు తగ్గుతారో వారే కెప్టెన్సీ పోటీదారులు ఎంచుకోబడతారు అని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో ఒక్కో జంట చర్చలు ప్రారంభించారు. ఈ జంటలలో ఒక్కోక్కరు కెప్టెన్ కావడానికి పోటీ పడాల్సి ఉంటుంది. అయితే ఆ జంటలలో ఎవరో ఒకరు మాత్రమే పోటీ చేయాల్సి ఉండడంతో కంప్రమైజ్ కోసం ట్రై చేస్తున్నారు. ఇందులో సన్నీ.. మానస్, శ్వేత.. యానీ మాస్టర్, శ్రీరామ చంద్ర.. హమీద జంటలలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై చర్చించుకుంటున్నట్లుగా చూపించారు. అయితే కెప్టెన్సీ పోటీకి అర్హులైన జంటలు కేవలం ఇవే అన్నట్లుగా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. మరి ఎవరెవరు పోటీ చేశారు.. ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది మాత్రం నేటి ఎపిసోడ్‏లో తేలిపోనుంది.

ప్రోమో..

Also Read: Puphpa: పుష్ప విలన్ మారిపోయాడా ? ఫస్ట్ పార్ట్‏లో ప్రతినాయకుడు ఫాహద్ కాకుండా ఆ నటుడు !!..

Sai Pallavi : కుర్రకారు మనసు దొచుకుంటున్న మౌనిక.. ఇలా సాయి పల్లవిని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Nani: నాని డేరింగ్ డెసిషన్.. ఆ స్టార్ హీరో సినిమాలో మరోసారి నెగిటివ్ షెడ్‏లో న్యాచురల్ స్టార్..