Bigg Boss 5 Telugu: నిబంధనలు ఉల్లంఘించిన కంటెస్టెంట్స్.. జెస్సీ తప్పుకు కాజల్‏కు పనిష్మెంట్.. .. బిగ్‏బాస్ ఇలా షాకిచ్చాడేంటీ..

బిగ్ బాస్.. గొడవలు.. లవ్ ట్రాక్స్, హగ్గులు, టాస్క్‏లు ఇంతే ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కాస్త కొత్తగా ట్రై చేశాడు బిగ్‏బాస్.

Bigg Boss 5 Telugu: నిబంధనలు ఉల్లంఘించిన కంటెస్టెంట్స్.. జెస్సీ తప్పుకు కాజల్‏కు పనిష్మెంట్.. .. బిగ్‏బాస్ ఇలా షాకిచ్చాడేంటీ..
Jessie
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 30, 2021 | 7:06 AM

బిగ్ బాస్.. గొడవలు.. లవ్ ట్రాక్స్, హగ్గులు, టాస్క్‏లు ఇంతే ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కాస్త కొత్తగా ట్రై చేశాడు బిగ్‏బాస్. కంటెస్టెంట్స్ ఆకలితో అలమటించేలా చేశాడు. ఫుడ్ కట్ చేసి.. ఆకలి బాధను.. ఆహారం విలువను తెలియజేసేలా చేశాడు. ఆకలి బాధను తెలియజేస్తూ ఇచ్చిన టాస్క్‏లో ఇంటి సభ్యులు ఆకలితో అల్లాడిపోయారు. నిన్నటి ఎపిసోడ్‏లో ఇంటి సభ్యుల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. నిన్నటి ఎపిసోడ్‏లో ఇంటి సభ్యులు జంటలుగా విడిపోయి టాస్క్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ముందుగా సన్నీ, మానస్ గేమ్ ఎలా ఆడాలనేది చర్చించుకున్నారు. అదే సమయంలో బరువు తగ్గడానికి ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే ముద్దపప్పు, ఆవకాయ అంటూ ఊహల్లో తెలిపోయారు. దీంతో ఈరోజు ఆగుదాం అంటూ వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఇక ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ లోబోకు ఎలాగైనా ఆహారం ఇప్పిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. సముద్రాలు, మురికి గుంట అంటూ ఏదో కొత్తరకం సామెత చెబుతూ కామెడి క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.

ఆ తర్వాత ఆకలి బాధని తెలియజెస్తూ సందేశాత్మకంగా మెసేజ్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పడంతో నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి, లోబో, విశ్వ, ప్రియ ఎమోషనల్ గా టాస్క్ చేసి ఏడిపించేశారు. ఆకలి రాజ్యం స్పూస్‏తో రచ్చ చేశారు. ఇక ఇంట్లో ఆహారాన్ని ఎవరూ ముట్టకూడదని బిగ్ బాస్ ఆదేశించినప్పటికీ లోబో, సన్నీ ఆహారాన్ని తినడంతో కెప్టెన్‏గా ఉన్న జెస్సీ విఫలం అయ్యాడని.. అందుకే అతనితోపాటు అతనికి జోడిగా ఉన్న కాజల్ కూడా కెప్టెన్ పోటీదారులుగా ఉండే అవకాశాన్ని కోల్పోయారని .. వాళ్లిద్దరూ కేవలం సంచాలకులుగా మాత్రమే ఉంటారని చెప్పారు బిగ్ బాస్. దీంతో తాను చెప్తున్నప్పటికీ రూల్స్ బ్రేక్ చేశారని ఫైర్ అయ్యాడు జెస్సీ. ఇక అనంతరం తన వల్ల కెప్టెన్ పోటీదారునిగా అర్హత కోల్పోయిన కాజల్‎కి క్షమాపణ చెప్పాడు. ఇక కెప్టెన్ కు నిజంగానే తాము సహకరించలేదని ఇంటి సభ్యులు ఫీల్ అయ్యారు. కానీ నటరాజ్ మాస్టర్ మాత్రం అసలు కెప్టెన్ ఇలా ఉంటాడా ? కమాండింగ్ ఉండాలి అని హిత బోధ చేశాడు. ఇక జెస్సీని చెడగొడుతున్నారని సన్నీ మానస్ అభిప్రాయపడ్డారు. మరోవైపు షణ్ముఖ్..జెస్సీని కూర్చోబెట్టుకుని ఇక్కడ అందరూ సమానమే.. ఎవరినీ అన్న, తమ్ముడు అని కాకుండా పేరు పెట్టి పిలవమని సూచించాడు.

Also Read: Bigg Boss 5 Telugu: ఇదేం దుస్థితి.. ఇంట్లో ఆకలి బాధలు.. చెత్త కవర్‏లో ఫుడ్ తీసుకునేందుకు లోబో ప్రయత్నాలు..

Aha – OTT: ‘ఆహా’లో మరో యాక్షన్ ప్యాక్డ్ మూవీ.. అక్టోబ‌ర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’