Bigg Boss 5 Telugu: ఇదేం దుస్థితి.. ఇంట్లో ఆకలి బాధలు.. చెత్త కవర్‏లో ఫుడ్ తీసుకునేందుకు లోబో ప్రయత్నాలు..

బిగ్‏బాస్ రూటు మార్చాడు.. ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఫిటింగ్స్ పెడుతూ.. శారీరక శ్రమ కలిగించే టాస్కులు పెడుతూ వచ్చేవాడు..

Bigg Boss 5 Telugu: ఇదేం దుస్థితి.. ఇంట్లో ఆకలి బాధలు.. చెత్త కవర్‏లో ఫుడ్ తీసుకునేందుకు లోబో ప్రయత్నాలు..
Lobo
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 30, 2021 | 6:35 AM

బిగ్‏బాస్ రూటు మార్చాడు.. ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఫిటింగ్స్ పెడుతూ.. శారీరక శ్రమ కలిగించే టాస్కులు పెడుతూ వచ్చేవాడు.. కానీ ఈసారి సరికొత్త ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఉన్న సభ్యులను ఆకలితో అలమటించేలా చేశాడు. ఆకలి బాధ అంటే ఎంటో ఇంట్లో సభ్యులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేశాడు. ఆకలి బాధను తట్టుకుని ఎవరు నిలబడతారో పరీక్షించాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‏లో మాత్రం ఇంటి సభ్యులకు ఫుడ్ కట్ చేసి.. ఆకలి బాధ అంటే ఎంటో రుచి చూపించాడు. సెప్టెంబర్ 29 ఎపిసోడ్‏లో ఏం జరిగిందో తెలుసుకుందామా..

ఇంటి సభ్యులంతా జంటలుగా విడిపోయి టాస్క్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అందులో కాజల్- జెస్సీ, షణ్ముఖ్-సిరి, శ్రీరామ్-హమీదా, లోబో-నటరాజ్, శ్వేతా-యానీ మాస్టర్, ప్రియ-ప్రియాంక, రవి-విశ్వ, సన్నీ-మానస్ జంటలుగా విడిపోయారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లోనూ ఇంటి సభ్యులకు ఫుడ్ ఇవ్వలేదు బిగ్ బాస్. ఒక్కో జోడి టాస్క్ ఎలా ముగించాలి ఎలా ఆడాలి అంటూ చర్చించుకున్నారు. ఇక రవి, ప్రియాంకల మధ్య ఫిజికల్ టాస్క్ జరిగింది. ఇందులో విశ్వ విజయం సాధించగా.. ఆ తర్వాత పోటీలలో ప్రియాంక, ప్రియ గట్టి పోటీనిచ్చారు. ఇక ఈ తర్వాత నటరాజ్ మాస్టర్ టీంలో ఉన్న లోబో ఆకలికి తట్టుకోలేక.. చెత్త కవర్లో దాటి పెట్టిన ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేశాడు..ఎవరూ చూడకుండా అందులో ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేశాడు. అయితే ఆ విషయాన్ని రవి పసిగట్టి.. రేయ్ ఏం చేస్తున్నావ్ రా అని వారించాడు. అయితే సీన్ చూసిన నటరాజ్ మాస్టర్ ఇలా చేయొద్దు నేను గేమ్ వదిలేస్తున్నా నువ్ తినెయ్ అని చెప్పాడు. ఇక ఆ తర్వాత సన్నీ మానస్ లు పవర్ రూం యాక్సెస్ లభించడంతో నటరాజ్ మాస్టర్, లోబోలను పోటీదారులకు ఎంచుకున్నారు. అయితే బయట మాత్రం షణ్ముఖ్, సిరిలు మాట్లాడుకుంటూ తప్పకుండా తమపేరే చెప్తారని గుసగుసలు పెట్టుకున్నారు. కానీ అందుకు భిన్నంగా సన్నీ మాత్రం నటరాజ్ మాస్టర్, లోబోలను ఎంచుకున్నాడు.

Also Read: Aha – OTT: ‘ఆహా’లో మరో యాక్షన్ ప్యాక్డ్ మూవీ.. అక్టోబ‌ర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’

Rana Daggubati: మరో యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయనున్న దగ్గుబాటి వారబ్బాయి..