Aha – OTT: ‘ఆహా’లో మరో యాక్షన్ ప్యాక్డ్ మూవీ.. అక్టోబ‌ర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’

తెలుగు వారికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.ఇందులో లేటెస్ట్ యాక్ష‌న్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’ అక్టోబ‌ర్ 1 నుంచి ప్రీమియ‌ర్‌గా విడుద‌ల‌వుతుంది.

Aha - OTT:  ‘ఆహా’లో మరో యాక్షన్ ప్యాక్డ్ మూవీ.. అక్టోబ‌ర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’
Aha
Follow us

|

Updated on: Sep 29, 2021 | 9:36 PM

Aha – OTT: తెలుగు వారికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.ఇందులో లేటెస్ట్ యాక్ష‌న్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’ అక్టోబ‌ర్ 1 నుంచి ప్రీమియ‌ర్‌గా విడుద‌ల‌వుతుంది. సిద్ధార్థ్‌, జి.వి.ప్ర‌కాశ్‌కుమార్, క‌రిష్మా ప‌ర‌దేశి, లిజోమోల్ జోషి, దీపా రామానుమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. త‌మిళ హిట్ చిత్రం ‘శివ‌ప్పు మంజ‌ల్ ప‌చ్చై’కు ఇది తెలుగు వెర్ష‌న్‌. బిచ్చ‌గాడు, శీను, రోజా పూలు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ చిత్రాల డైరెక్ట‌ర్ శ‌శి.. ఒరేయ్ బామ్మ‌ర్దిని తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

‘ఒరేయ్ బామ్మర్ది’ సినిమా విషయానికి వస్తే రాజ్యలక్ష్మి అనే అమ్మాయి తన భర్త రాజశేఖర్, తన తమ్ముడు మదన్ పడే ఘర్షణల నడుమ ఎవరికీ సర్ది చెప్పలేక బాధపడుతుంటుంది. మదన్ బైక్ రేసర్. బైక్‌ను వేగంగా న‌డుపుతూ రోడ్డుపై త‌ను చేసే సాహ‌సాల కార‌ణంగా ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను క్రియేట్ చేస్తుంటాడు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ అయిన రాజ‌శేఖ‌ర్‌కు ఇది న‌చ్చ‌దు. అయితే అనుకోకుండా ఇద్ద‌రూ బావ, బామ‌ర్దిలవుతారు. మ‌రి రాజ్య‌ల‌క్ష్మి వీరి మ‌ధ్య ఉండే దూరాన్ని త‌గ్గించ‌గ‌లిగిందా? బావ రాజశేఖ‌ర్‌తో ఉన్న గొడ‌వ‌ల‌ను మ‌ద‌న్ మ‌ర‌చిపోయాడా? బైక్ రేసింగ్‌ను విడిచిపెట్టేశాడా? అనే విష‌యాల గురించి చెప్పే చిత్ర‌మే ఒరేయ్ బామ్మ‌ర్ది..

పాత్ర‌ల‌ను డెప్త్‌గా రాసుకుని, వాటిని ఎమోష‌న్స్‌ను మిక్స్ చేసి, వాటిని మాన‌వ సంబంధాలు రిలేట్ అయ్యే తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు శ‌శి. డిఫ‌రెంట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఒరేయ్ బామ్మ‌ర్ది ఊహించ‌ని మ‌లుపుల‌తో రెగ్యుల‌ర్ ఫ్యామిలీ చిత్రాల‌కు భిన్నంగా రూపొందించ‌బ‌డింది. సిద్ధార్థ్‌, జి.వి.ప్ర‌కాశ్‌, క‌రిష్మా ప‌ర‌దేశి, లిజోమోల్ జోషి వారి పెర్ఫామెన్స్‌ల‌తో పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. శాన్ లోకేశ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రానికి ప్ర‌స‌న్న‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సిద్ధు కుమార్ సంగీతాన్ని అందించారు. ర‌మేశ్ పి.పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మించారు.

2021 ఏడాదిలో ‘ఆహా’ … క్రాక్‌, ఎస్.ఆర్.కళ్యాణ మండపం, వాహనములు నిలుపరాదు, లెవన్త్ అవర్, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, చ‌తుర్ ముఖం, కుడి ఎడ‌మైతే, త‌ర‌గ‌తిగ‌ది దాటి, ది బేక‌ర్ అంద్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాలు, వెబ్ షోస్‌ల‌తో ప్ర‌తి ఒక తెలుగువారి ఇంట తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ భాగ‌మైంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan : భగత్ సింగ్‌‌‌కు జోహార్లు అర్పిస్తాం.. గాంధీజీ ముందు మోకరిల్లుతాం.. మీలాంటి వాళ్లను తాటతీస్తాం : పవన్ కళ్యాణ్

AP Politics: రాజకీయ పార్టీని టెంట్‎హౌస్‎లా అద్దెకు ఇస్తున్నారు.. మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..