AP Politics: రాజకీయ పార్టీని టెంట్‎హౌస్‎లా అద్దెకు ఇస్తున్నారు.. మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ మంత్రి పేర్ని నాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‎పై విరుచుకుపడ్డారు. పవన్ కిరాయి రాజకీయ పెట్టారని ఆరోపించారు...

AP Politics: రాజకీయ పార్టీని టెంట్‎హౌస్‎లా అద్దెకు ఇస్తున్నారు.. మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
Perni
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Sep 29, 2021 | 6:07 PM

జనసేన, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ ఏపీ సర్కారుపైనా, మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై పేర్ని నాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‎పై విరుచుకుపడ్డారు.. పవన్ కిరాయి రాజకీయ పెట్టారని ఆరోపించారు. రాజకీయ పార్టీని టెంట్‎హౌస్‎లా అద్దెకు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆడియో ఫంక్షన్‎లో జరిగిన దానిపై మెగాస్టార్ చిరంజీవి తనతో మాట్లాడారని నాని చెప్పారు. ఆడియో ఫక్షన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆడియో ఫక్షన్‎లో జరిగిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి చెప్పినట్లు మంత్రి వివరించారు.

చిరు మాటాలతో తాను ఏకీభవించినట్లు చెప్పారు. ఆన్‎లైన్ టికెట్ బుకింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఇది ప్రభుత్వం కొత్త ప్రవేశపెట్టింది కాదు. సినీ పరిశ్రమ ఆన్‎లైన్ టికెట్ బుకింగ్‎కు అనుకూలంగా ఉందని చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఏకాభిప్రాయంగా తీసుకోబోమని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Read Also.. Pawan Kalyan: అమరావతిని వుంచుతామంటేనే వారితో కలిసా.. ఒక్కసారి గెలిపించండి.. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాః పవన్