Pawan Kalyan: ఎవరు ఏం చేశారో వారికి ప్రతిఫలం ఇస్తాం.. పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాః పవన్

Janasena President Pawan Kalyan: నేను ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాను.. గత్యంతరం లేక సినిమాల్లోకి వచ్చాను.. ఇష్టపడి కాదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan: ఎవరు ఏం చేశారో వారికి ప్రతిఫలం ఇస్తాం.. పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాః పవన్
Pawan Kalyan 1
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 29, 2021 | 6:00 PM

Pawan Kalyan: నేను ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాను.. గత్యంతరం లేక సినిమాల్లోకి వచ్చాను.. ఇష్టపడి కాదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం అధికార పార్టీపై తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాను.. రాజకీయాల్లో కలుపుమొక్కల్ని తీసేయాలన్న సంకల్పంతోనే పార్టీని స్థాపించి ప్రజా సేవకు వచ్చానన్నారు. తాను ఏది అడిగినా ఆంధ్రప్రదేశ్ కోసమేనని, గతంలో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చింది కూడా రాష్ట్ర సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు.

‘‘ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి మీరెవరు? అని ప్రశ్నించా. నేను అడిగింది సినిమా థియేటర్ల గురించి, నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ వాళ్లకే థియేటర్లుంది. మహానుభావులకు తల వంచుతాం, మీలాంటి దోపిడీదారుల తాట తీస్తామన్నారు. ఏపీలో అసలు అభివృద్ధి లేదన్న పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో ఒక్క రోడ్డు అయినా వేశారా?’’ అని పవన్ ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా.. అనకాపల్లి నుంచి అనంతపురం దాకా బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను గుర్తు పెట్టుకుంటున్నామని, అధికారంలోకి రాగానే లెక్క కట్టి తాటతీస్తామన్నారు. తెలంగాణ కోసం పార్టీలు, కులాలకు సంబంధం లేకుండా వస్తారన్న పవన్.. ఏపీలో మాత్రం కులాలు, మతాల పేరుతో రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి.. త్వరలో అధికార పార్టీ అంతం మొదలవుతుందని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం 151 సీట్లు వచ్చిన వైసీపీ.. 15 సీట్లకు కూడా రావచ్చన్నారు. మొన్న కౌరవ సభ చూపించారు కదా.. పాండవ సభ ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ధర్మంతో పెట్టుకున్నారు కదా మీరు.. వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోందన్నారు. జనసేనపై మాట్లిడితే తోలుతీస్తామన్న పవన్ కళ్యాణ్.. వర్గపోరుతో రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తూ.. దోచుకుంటున్నారన్న ఆయన వైసీపీ నాయకుల చిట్టా రాయండి అంటూ పిలుపునిచ్చారు. Read Also… Pawan Kalyan: అమరావతిని వుంచుతామంటేనే వారితో కలిసా.. ఒక్కసారి గెలిపించండి.. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాః పవన్

చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు