Pawan Kalyan: అమరావతిని వుంచుతామంటేనే వారితో కలిసా.. ఒక్కసారి గెలిపించండి.. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాః పవన్
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమరావతి రాజధానిగా ఉంటుందన్న ఒక్క కారణం చేత ఆ పార్టీకి మద్దతు పలికాః పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఓ సినిమా ఫంక్షన్ వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. వైసీపీ-జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజా పరిణామాలపై జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా ఒక కవితను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పవన్ కల్యాణ్.. అదే కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమరావతి రాజధానిగా ఉంటుందన్న ఒక్క కారణం చేత ఆ పార్టీకి మద్దతు పలికానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
నేను సమస్య నుంచి పారిపోను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీక పాలనను గమనిస్తున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అధికార వైసీపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ప్రజా సంక్షేమ పేరుతో ప్రజల మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాయలసీమలో దళితుల హక్కుల్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మంటే రెండు కులాలు కాదు.. వర్గపోరుతో రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కులాల పేరుతో రాష్ట్ర అభివృద్ధి విస్మరించవద్దని పవన్ సూచించారు.
ఈ సంధర్బంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్ధుకుంటానని, జరిగిన దానికి ప్రశ్చాత్తాపపడుతున్నానన్నారు. మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానన్నారు. మీరు నన్ను ఒక్కసారి గెలిపించి చూపించండి.. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్న పవన్.. శాంతిభద్రత అంటే ఏంటో చూపిస్తానన్నారు. ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకువస్తానన్నారు. నా కులం వాళ్లతోనే నన్ను తిట్టిస్తున్నారని ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్.. ఒక్కరెందుకు అన్ని కులాల వాళ్లతోనూ తిట్టించండి.. నా కులానికి ఎప్పుడూ దూరం కాలేదని స్పష్టం చేశారు. అలాగే, వేరే కులాలపట్ల అగౌరవంగా ఉండనని తెలిపారు. వైసీపీ నేతలు కన్ఫ్యూజింగ్ ఐడియాలజీ అని విమర్శిస్తారు.. మీరు వేరే పార్టీల్లోని ఎమ్మెల్యేలను లాక్కోవడం తప్పుకాదా? అని ప్రశ్నించారు. అవసరమైనప్పుడు మేం వ్యూహం మారుస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. Read Also… Pawan Kalyan : భగత్ సింగ్‌కు జోహార్లు అర్పిస్తాం.. గాంధీజీ ముందు మోకరిల్లుతాం.. మీలాంటి వాళ్లను తాటతీస్తాం : పవన్ కళ్యాణ్