Rana Daggubati: మరో యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయనున్న దగ్గుబాటి వారబ్బాయి..

గ్గుబాటి హీరో రానా.. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఇట్టే ఒదిగిపోతారు ఈ టాల్ హీరో. చేసింది తక్కువ సినిమాలే అయినా రానా తన నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు

Rana Daggubati: మరో యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయనున్న దగ్గుబాటి వారబ్బాయి..
Rana
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 29, 2021 | 8:50 PM

Rana Daggubati: దగ్గుబాటి హీరో రానా.. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఇట్టే ఒదిగిపోతారు ఈ టాల్ హీరో. చేసింది తక్కువ సినిమాలే అయినా రానా తన నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. హీరోగా లీడర్ సినిమాతో పరిచయం అయినా రానా ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హీరోగానే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉంటే విలన్ గాను నటించి మెప్పించారు ఈ హ్యాండ్సమ్ హంక్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు రానా. ఈ సినిమా రానాకు అంతులేని పేరు తెచ్చిపెట్టింది. రానా పేరు దేశాలు దాటి వినిపించేలా చేసింది బాహుబలి సినిమా. అలాగే బాలీవుడ్ లోనూ నటించారు రానా. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 4లో విలన్‌గా నటించారు రానా. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటిస్తున్నారు రానా.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో రానా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డానియల్ శేఖర్ గా కనిపించనున్నారు రానా. ఈ సినిమా తరువాత బాబాయి వెంకటేష్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయనున్నారు రానా. ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం వెంకీ రానా కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాల తర్వాత రానా మరో యంగ్ హీరోతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న సినిమాలో శర్వానంద్ తో కలిసి రానా నటించబోతున్నాడు. ఈ సినిమా లో శర్వా మరియు రానాలు ఇద్దరు కూడా హీరోలుగానే కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఆయా సినిమాలు పూర్తయిన తర్వాత ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడట..అతి త్వరలోనే మైత్రి వారు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్డేట్ ఇవ్వబోతున్నారు. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుది మెరుగులు అద్దుతున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan : భగత్ సింగ్‌‌‌కు జోహార్లు అర్పిస్తాం.. గాంధీజీ ముందు మోకరిల్లుతాం.. మీలాంటి వాళ్లను తాటతీస్తాం : పవన్ కళ్యాణ్

AP Politics: రాజకీయ పార్టీని టెంట్‎హౌస్‎లా అద్దెకు ఇస్తున్నారు.. మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
PSLకి భారీ దెబ్బ: స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లేకుండానే లీగ్..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
రాజ్యాంగంపై ప్రమాణం.. అంబేద్కర్ ఫొటో ఎదుట పెళ్లి..
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు