Puphpa: పుష్ప విలన్ మారిపోయాడా ? ఫస్ట్ పార్ట్‏లో ప్రతినాయకుడు ఫాహద్ కాకుండా ఆ నటుడు !!..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమర్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా

Puphpa: పుష్ప విలన్ మారిపోయాడా ? ఫస్ట్ పార్ట్‏లో ప్రతినాయకుడు ఫాహద్ కాకుండా ఆ నటుడు !!..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 30, 2021 | 12:29 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమర్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనుంది. ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే..ఈ మూవీ పోస్టర్స్, ఇంట్రడ్యూసింగ్ వీడియోస్ విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.

మొదటి నుంచి ఈ సినిమాలోని ప్రతినాయకుడి పాత్ర పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో విలన్ పాత్రలో మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు మేకర్స్. అయితే తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఫాజిల్ ఫస్ట్ పార్ట్ పూర్తిగా కనిపించడు అంటా. సినిమా చివరలో అంటే కథ పతాకస్థాయికి చేరుకుంటున్న సమయంలో కనిపిస్తారట. అలా ఆయన ఎంట్రీతో ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించి, సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఫస్ట్ పార్ట్ విలన్ ఎవరనేది సందేహాలు రాకమానవు.. ఇక్కడే అసలు ట్విస్ట్.. పుష్ప ఫస్ట్ పాం మొత్తం విలన్ పాత్రలో సునిల్ కనిపించనున్నాడట. దీంతో సినిమాపై పై అంచనాలు మరింత పెరుగుతున్నాయనే అనుకోవాలి. ముఖ్యంగా అల్లు అర్జున్‏ను ఢీకొట్టబోయే పాత్రలో సునిల్ కనిపించనుండడంతో సినిమా ఏ రెంజ్‏లో ఉండబోతుందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Also Read: Sai Pallavi : కుర్రకారు మనసు దొచుకుంటున్న మౌనిక.. ఇలా సాయి పల్లవిని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Poorna New Photos: ఇంత అందం ఆమె సొంతం.. కుర్రకారుని ఆకట్టుకుంటున్న ‘పూర్ణ’ అందాలు.. (ఫొటోస్)