AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: నాని డేరింగ్ డెసిషన్.. ఆ స్టార్ హీరో సినిమాలో మరోసారి నెగిటివ్ షెడ్‏లో న్యాచురల్ స్టార్..

అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించిన నాని.. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా మారాడు.. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. నానికి స్పెషల్

Nani: నాని డేరింగ్ డెసిషన్.. ఆ స్టార్ హీరో సినిమాలో మరోసారి నెగిటివ్ షెడ్‏లో న్యాచురల్ స్టార్..
Nani
Rajitha Chanti
|

Updated on: Sep 30, 2021 | 9:33 AM

Share

అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించిన నాని.. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా మారాడు.. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. నానికి స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత.. నానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. నాని తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ న్యాచురల్ స్టార్‏గా మారాడు. న్యాచురల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్టు, ప్లాపు సంబంధం లేకుండా ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఇటీవలే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలను చేస్తున్నాడు. అలాగే తన సొంత బ్యానర్‏పై చిత్రాలను తెరకెక్కిస్తూ.. నిర్మాతగానూ సక్సెస్ అందుకుంటున్నాడు హీరో నాని. అయితే ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న నాని.. ఇప్పుడు మరోసారి సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడట.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. న్యాచురల్ స్టార్ నాని ఈసారి విలన్ పాత్ర చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి ఇటీవలే మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసే విజయ్.. ఈసారి నేరుగా తెలుగులో మూవీ చేయబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మించనున్నాడు. ఇటీవలే ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నాని విలన్ పాత్ర చేయబోతున్నాడట. ఇప్పటికే.. వీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించి అదరగొట్టాడు నాని. ఇప్పుడు పూర్తిగా విలన్ పాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడట. అలాగే ఇందులో విజయ్ సరసన… కియారా అద్వానీ లేదా రష్మిక మందన్నాలలో ఒకరిని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. ఇక ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ అక్టోబర్ 27 నుంచ ప్రారంభం కానుంది.

Also Read: Mohan Babu: ఆరు నెలలు పనిచేయించుకుని 50 రూపాయాలు జీతం ఇచ్చారు.. మోహన్ బాబు ఆసక్తికర విషయాలు..

Radhe Shyam: సంక్రాంతి బరిలో ప్రభాస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన మేకర్స్..

Maa Elections 2021: ప్రచారంలోనూ పోటా పోటీ.. ప్రకాష్ రాజ్ ట్వీట్‏కు బండ్ల గణేష్