Radhe Shyam: సంక్రాంతి బరిలో ప్రభాస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన మేకర్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ జరుపుకుంటుండగా..

Radhe Shyam: సంక్రాంతి బరిలో ప్రభాస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన మేకర్స్..
Radheshyam
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 30, 2021 | 7:39 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ జరుపుకుంటుండగా.. రాధేశ్యామ్ సినిమా మాత్రం చిత్రీకరణ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకోవడమే కాకుండా.. రాధేశ్యామ్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని భారీ బడ్జెట్‏తో యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల తేదీపై పలు రకాల టాక్ వినిపిస్తోంది. రాధేశ్యామ్ సినిమా ఇప్పట్లో రావడం కష్టమేనంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా.. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు తలెత్తాయని.. సినిమా రీషూట్ చేస్తున్నారని.. ఇలా విభిన్న రకాలుగా కామెంట్స్ వినిపించాయి. ఈ రూమర్స్ అన్నింటికీ ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టేసింది చిత్రయూనిట్.. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ రిలీజ్ డేట్ పై స్పష్టత ఇచ్చారు మేకర్స్. ఈ మూవీని సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సినిమానే కాకుండా.. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీ చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు.

ట్వీట్..

Also Read: ఈ ఫోటోలో ఉంది నటుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కుర్రకారు మెచ్చే నటి.. గుర్తుపట్టండి

Bigg Boss 5 Telugu: నిబంధనలు ఉల్లంఘించిన కంటెస్టెంట్స్.. జెస్సీ తప్పుకు కాజల్‏కు పనిష్మెంట్.. .. బిగ్‏బాస్ ఇలా షాకిచ్చాడేంటీ..

Bigg Boss 5 Telugu: ఇదేం దుస్థితి.. ఇంట్లో ఆకలి బాధలు.. చెత్త కవర్‏లో ఫుడ్ తీసుకునేందుకు లోబో ప్రయత్నాలు..