Bigg Boss 5 Telugu: హద్దులు దాటిన ‘బిగ్ బాస్’ ప్రోమో.. కత్తులతో చెలగాటం.. విరుచుకుపడుతున్న నెటిజన్లు.!
తెలుగు బిగ్ బాస్ నాలుగో వారం చివరికి చేరుకుంది. సాధారణంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉంటే.. తమను తాము కాపాడుకునేందుకు..
తెలుగు బిగ్ బాస్ నాలుగో వారం చివరికి చేరుకుంది. సాధారణంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉంటే.. తమను తాము కాపాడుకునేందుకు కెప్టెన్సీ కోసం పోటీ పడతారు. ఈ క్రమంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ-మానస్, శ్రీరామ్-హమీదా, శ్వేత-యానీ మాస్టర్ జోడీలు నిల్చునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ ‘కత్తులతో సహవాసం’. ఈ టాస్క్‌లో ఆయా జోడీల నుంచి మొదటిగా సన్నీ, శ్వేత, శ్రీరామ్ పోటీ పడగా.. వీరిలో ఎవరు కెప్టెన్సీకి అనర్హులో వివరంగా రీజన్ చెప్పి.. వారి నడుముకు కట్టిన బెల్త్‌పై కత్తులు పొడవాలంటూ మిగతా కంటెస్టెంట్లకు బిగ్ బాస్ సూచనలు ఇచ్చాడు.
ఈ క్రమంలోనే అత్యధిక కత్తి పోట్లు సన్నీకి పడ్డాయి. దాదాపుగా తన మిత్రులు అనుకున్నవారు కూడా సన్నీకి ద్రోహం చేశారని ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. అలాగే నెటిజన్లు కూడా సన్నీకే మద్దతు తెలిపారు. ”అందరూ టార్గెట్ చేసినా… సన్నీకే మా ఫుల్ సపోర్ట్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టాస్క్‌లో మరోసారి విశ్వ-సన్నీ, షణ్ముఖ్-సన్నీ మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే.. సన్నీ హౌస్‌లో ఒంటరి వాడైనా.. బయట మాత్రం ఫుల్ సపోర్ట్ దక్కించుకున్నాడు. మరో కౌశల్ అయ్యేలా కనిపిస్తున్నాడని చెప్పొచ్చు.
మరోవైపు హౌస్‌లో నమ్మకద్రోహులు ఎవరన్నది ఇన్‌డైరెక్ట్‌గా ”కత్తులతో సహవాసం” అనే టాస్క్ ద్వారా బిగ్ బాస్ బయటపెట్టగా.. ఇలాంటి టాస్కులు హింస, నేరాలు, రక్తపాతాన్ని ప్రోత్సహించేలా ఉంటాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ టాస్క్‌లతో చిన్న పిల్లలకు ఏమి కల్చర్ నేర్పించాలనుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.