Chiranjeevi: చిరు లీక్స్.. భోళాశంకర్ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన చిరంజీవి
ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి సిస్టర్ గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ్ లో తెరకెక్కిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. తమిళ్ లో అజిత్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. అజిత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఇప్పుడు ఇదే సినిమాను మెహర్ రమేష్ భోళాశంకర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి సిస్టర్ గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దాంతో భోళాశంకర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫోటోలు, ఫస్ట్ సాంగ్ వైరల్ గా మారింది. యూట్యూబ్ మొత్తం భోళా శంకర్ యుఫోరియాతో ఊగిపోతోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఫస్ట్ సింగిల్ ఇప్పుడు అందర్నీ ఊగిపోయేలా చేస్తోంది. స్వర సాగర్ మాస్ బీట్‌కు.. చిరు చేసిన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకుంటుంది. జెస్ట్ 24 గంటల్లోనే దాదాపు 10 మిలియన్ రియల్ టైం వ్యూస్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. యూట్యూబ్ మ్యూజిక్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమాపై కూడా ఒక్క సారిగా అంచనాలను కూడా పెంచేలా చేసుకుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన విషయాన్నీ మెగాస్టార్ లీక్ చేశారు. చిరు లీక్స్ పేరుతో తాజాగా భోళా శంకర్ సినిమా నుంచి న్యూ సాంగ్ కు సంబంధించిన వీడియో ను షేర్ చేశారు చిరు. సినిమాలో ఈ సాంగ్ సంగీత్ కు సంబంధించింది. ఈ పాటలో సినిమాలో ఉన్న నటీ నటులందరూ పాల్గొన్నారు. ఈ సాంగ్ చూడముచ్చటగా ఉంది. భోళా శంకర్ సినిమా బంపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram