AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Calling Sahasra: నేను చేసిన సినిమాల‌కు భిన్నమైన సినిమా ఇది.. సుధీర్ ఇంట్రెస్టింగ్ మూవీ కాలింగ్ సహస్త్ర

సుధీర్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు క‌టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలిశ్య హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Calling Sahasra: నేను చేసిన సినిమాల‌కు భిన్నమైన సినిమా ఇది.. సుధీర్ ఇంట్రెస్టింగ్ మూవీ కాలింగ్ సహస్త్ర
Sudigali Sudheer
Rajeev Rayala
|

Updated on: Jun 08, 2023 | 4:41 PM

Share

అటు బుల్లి తెర ఇటు సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ సుడిగాలి సుధీర్‌. యాంకర్ గా రాణిస్తున్న సుధీర్ హీరోగానూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వారసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సుధీర్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు క‌టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలిశ్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం నుంచి బుధ‌వారం ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను మీడియా మిత్రులు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఈ పాట గురించి ప్రముఖ సింగర్ కె.ఎస్‌.చిత్ర మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడి సాంగ్ పాడాను. చాలా చక్కటి సాంగ్. చాలా రోజుల తర్వాత మంచి మెలోడీ సాంగ్ పాడినట్లు అనిపించింది. సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

హీరో సుధీర్ మాట్లాడుతూ ‘‘మా టీమ్ తరపున సాంగ్ లాంచ్ చేసిన మీడియా ఫ్యామిలీకి థాంక్స్. మోహిత్, లక్ష్మీ ప్రియాంక‌గారికి థాంక్స్‌. చిత్ర‌మ్మ‌గారి ఆశీస్సులు మాకెప్పుడూ ఉంటాయి. స‌న్నీ బ్యూటీఫుల్ విజువ‌ల్స్ అందించారు. మా నిర్మాత‌లు విజేష్‌, వెంక‌ట్‌, చిరంజీవిగారికి థాంక్స్‌. మూడేళ్ల క‌ష్టంఈ సినిమా. చాలా స్ట్ర‌గుల్స్ దాటి ఈ స్టేజ్‌కి చేరుకున్నాం. మా డైరెక్ట‌ర్ అరుణ్‌గారు క‌థ చెప్పే స‌మ‌యంలో బ్లూటూత్ స్పీక‌ర్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ క‌థ‌ను చెబుతూ వ‌చ్చారు. అంత రేంజ్‌లో మూడ్ క్రియేట్ చేస్తూ ఇన్‌టెన్స్‌తో సినిమా చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌కు భిన్నంగా డిఫ‌రెంట్ జోన‌ర్‌లో చేసిన సినిమా ఇది. నాపై న‌మ్మకంతో సినిమా చేసిన డైరెక్ట‌ర్‌, నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. శివ బాలాజీగారు అందించిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. హీరోయిన్ డాలిశ్య‌గారు వండ‌ర్‌ఫుల్ న‌టి. టీమ్ అంద‌రం ఫ్యామిలీలా క‌లిసిపోయి యాక్ట్ చేశాం. సినిమా ఫైన‌ల్ స్టేజ్‌లో గ్యారీ గారు స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చారు. ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. మార్క్ కె.రాబిన్‌గారికి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా గొప్ప‌గా ఇచ్చారు. ఈ సినిమాకు ప‌ని చేసిన ప్రతి మెంబ‌ర్‌కి థాంక్స్‌’’ అన్నారు

Follow Us