Brahmanandam: బ్రహ్మానందం బ్రహ్మాండమైన నటనకు ఫిదా అయిన చిరు, చరణ్

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమాను సినీ ప్రముఖులకు ప్రీమియర్స్ వేసి చూపించారు దర్శకుడు కృష్ణవంశీ. అలాగే ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది ఈ మూవీ.

Brahmanandam: బ్రహ్మానందం బ్రహ్మాండమైన నటనకు ఫిదా అయిన చిరు, చరణ్
Brahmanandam
Follow us

|

Updated on: Mar 23, 2023 | 3:58 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తేరైకెక్కించిన లేటెస్ట్ మూవీ రంగమార్తాండ. నటసామ్రాట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమాను సినీ ప్రముఖులకు ప్రీమియర్స్ వేసి చూపించారు దర్శకుడు కృష్ణవంశీ. అలాగే ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది ఈ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరోసారి తన నటనతో ఆకట్టుకోగా.. బ్రహ్మానందం అద్భుత నటనతో మనసులను కదిలించారు.

సినిమా చూసినవారంతా బ్రహ్మానందం నటనను మెచ్చుకుంటున్నారు. ఆయన నటనకు ఫిదా అయ్యారు. బ్రహ్మానందం అంటే కేవలం నవ్విస్తాడు.. అనే భావనను ఈ సినిమా పూర్తిగా మార్చేసింది. ఆయనలోని మరో కోణాన్ని ఈ సినిమా బయట పెట్టింది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగమార్తాండ సినిమా చూశారు. ఈ సినిమాలో బ్రహ్మనందం నటనకు ఫిదా అయిన చిరు, చరణ్. ఆయనను శాలువా తో సత్కరించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.