Leo Movie: విజయ్ ‘లియో’ ట్రైలర్ రిలీజ్.. ఆ థియేటర్లకు నోటీసులు జారీ.. కారణమిదే
దళపతి విజయ్ నటించిన 'లియో' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవల విడుదలైంది. అయితే ఇప్పుడు లియో ట్రైలర్‌ను ప్రసారం చేసిన థియేటర్లకు ఇబ్బందులు వచ్చిపడ్డాయి.

దళపతి విజయ్ నటించిన ‘లియో’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవల విడుదలైంది. అయితే ఇప్పుడు లియో ట్రైలర్‌ను ప్రసారం చేసిన థియేటర్లకు ఇబ్బందులు వచ్చిపడ్డాయి. సెన్సార్ సర్టిఫికెట్ లేకుండానే థియేటర్లలో ఈ ట్రైలర్‌ను విడుదల చేయడమే దీనికి కారణం. దీంతో థియేటర్ల యాజమాన్యాలకు సెన్సార్ బోర్డు నోటీసులు జారీ చేసింది . యూట్యూబ్‌లో ట్రైలర్‌లను విడుదల చేయడానికి సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేదు. అయితే థియేటర్లో సినిమా, ప్రకటన, ట్రైలర్ వేస్తే సెన్సార్ సర్టిఫికెట్ చాలా అవసరం. అయితే సెన్సార్ సర్టిఫికేట్ రానప్పటికీ ‘లియో’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం, సెన్సార్ చేయని కంటెంట్‌ను థియేటర్లలో ప్రదర్శించడం నేరం. ఇది క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది. కోర్టు కూడా శిక్ష విధించవచ్చు. ఈ కారణంగా థియేటర్ యాజమాన్యానికి సెన్సార్ బోర్డు నోటీసులు జారీ చేసి వెంటనే సమాధానం చెప్పాలని కోరింది. ఈ నోటీసులో ‘లియో’ సినిమా సెన్సార్ కాలేదని సెన్సార్ బోర్డు స్పష్టంగా పేర్కొంది. ‘లియో’ అధీకృత ట్రైలర్‌ను ఎవరు ఇచ్చారో చెప్పండి. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కారణాలు చెప్పాలని సీబీఎఫ్‌సీ చెన్నై థియేటర్లను కోరింది.
కాగా, ‘లియో’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘యు/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. 13 అంశాల్లో మార్పులను సూచించింది. ఈ మార్పు చేసిన తర్వాతే సినిమాను విడుదల చేయాల్సిన అవసరం టీమ్‌కి ఉంది. దళపతి విజయ్ నటించిన లియోలో త్రిష, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు నటించారు. సంజయ్ దత్ కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. మరోవైపు లియో ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా లీ మూవీ రిలీజ్ కానుంది.
Unleashing my @actorvijay na in a never seen before avatar 🔥💯#LeoTrailer
Tamil: https://t.co/yVnAVolBUh
Telugu: https://t.co/ppRRPK6TLX
Kannada: https://t.co/zvrRp1yvB7#LeoFromOctober19#LEO 🔥🧊
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




