Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Actor: ఈ ఫోటోలోని వ్యక్తి టాలీవుడ్‌లో చాలా ఫేమస్.. హీరోగా కూడా చేశారు.. ఎవరో గుర్తించగలరా..?

ఈ ఫోటోలోని వ్యక్తి పలు తెలుగు చిత్రాల్లో హీరోగా చేశాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పాత్రలు పోషిస్తున్నాడు. ఈయన ఎవరో మీరు గుర్తించగలరా..?

Tollywood Actor: ఈ ఫోటోలోని వ్యక్తి టాలీవుడ్‌లో చాలా ఫేమస్.. హీరోగా కూడా చేశారు.. ఎవరో గుర్తించగలరా..?
Vinayakudu Fame
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 10, 2021 | 1:12 PM

ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా సరే.. నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తారు. ఇక వారి ఓల్డ్ వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతాయి. చాలామంది నటీనటులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఓ టాలీవుడ్ నటుడి ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అతడు ఇప్పుడు పలానా స్టార్ అంటే ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతకీ మీరు అయినా గెస్ చేశారా..?. చిన్న క్లూ ఏంటి అంటే ఇతను  కొన్ని సినిమాల్లో హీరోగాను, మరికొన్ని సినిమాల్లో హీరోకు ఫ్రెండ్‌గానూ నటించాడు. ఇప్పటికైనా కొంచెం గుర్తుకొచ్చిందా? అయ్యో లేదా. అయితే మేమే రివీల్ చేస్తాం  లేండి. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు లాంటి సినిమాల హీరో కృష్ణుడు యుక్త వయస్సులో ఉన్నప్పటి ఫోటో ఇది. ఓ ప్రమాదానికి గురైన తర్వాత మందుల వాడకం, బెడ్‌పై ఉండాల్సి రావడంతో ఆయన ఒళ్లు విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి లావుకాక ముందు కృష్ణుడు ఇలాగే ఉండేవాడు. అతను తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలోని ఓ ఫొటో స్టూడియోలో తీయించుకున్న ఫొటో ఇది. మంచి క్రాఫు, పువ్వుల చొక్కా, జీన్సు ప్యాంటుతో మెరిసిపోతున్న ఈ ఫోటో ఆయన సినిమాల్లో వేషాల కోసం ట్రై చేయడానికి తీయించుకున్నట్లు తెలిసింది. కాగా కృష్ణుడుకి ఇప్పటికీ మంచి పాత్రలు దక్కుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల పేకాట ఆడుతూ దొరకడంతో ఆయన ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడును ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా హ్యాపీడేస్ చిత్రంలో కృష్ణుడు వేసిన పాత్ర అందరకీ గుర్తుండిపోతుంది.

Krishnudu

Krishnudu

Also Read: పాపం ఆడపిల్ల లిఫ్ట్ అడిగింది కదా అని ఇచ్చాడు.. ఆపై ఊహించని సీన్

దొంగగా మారిన కానిస్టేబుల్.. యూనిఫామ్‌లోనే దుస్తులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు