Chittoor District: దొంగగా మారిన కానిస్టేబుల్… యూనిఫామ్‌లోనే దుస్తులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు

అతడో పోలీస్. తప్పులు చేసినవాళ్లని పట్టుకోవాలి. కానీ అతడే పెద్ద తప్పు చేశాడు. ఏకంగా యూనిఫామ్‌లోనే దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

Chittoor District: దొంగగా మారిన కానిస్టేబుల్... యూనిఫామ్‌లోనే దుస్తులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు
Theft Police
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 10, 2021 | 10:33 AM

అతడో పోలీస్. శాంతి భద్రతలను పరిరక్షించడం అతడి డ్యూటీ. నలుగురికి ఆదర్శంగా నిలవాలి. ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్లి లాకప్‌లో వేయాలి. కానీ అతడే దారి తప్పాడు. ఏకంగా దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు చిక్కడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లాలో ఈ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.  దొంగ అవతారమెత్తిన పోలీసు 2 రోజుల క్రితం కలెక్టరేట్ రోడ్‌ లోని ఒక ఒమిని వ్యాన్ వద్ద ఉంచిన బట్టల్ని దొంగలిస్తూ నిఘా కంటికి అడ్డంగా దొరికిపోయాడు. దీన్ని గోప్యంగా ఉంచేందుకు కొందరు ప్రయత్నం చేసినా వ్యాపారి ఫిర్యాదు చేయడానికి వెనకాడకపోవడంతో ఈ దొంగ పోలీస్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో ఒమిని వ్యానులో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. రోజూ పని ముగించుకున్న అనంతరం.. దుస్తలు అన్నీ మూటగట్టి.. తాడుతో కట్టి వెళ్లేవాడు. అదే విధంగా ఇటీవల రాత్రివేళ దుస్తులు మూట గట్టి వెళ్లి మరుసటిరోజు వచ్చి చూసేసరికి తక్కువగా ఉండటాన్ని గుర్తించాడు. ఆయన ముందు చూపుతో ఎవరికీ తెలియకుండా అమర్చిన సీసీ కెమెరా దొంగగా మారిన కానిస్టేబుల్‌ను పట్టించింది. సీసీ ఫుటేజీని చూడటంతో చోరీ చేసిన వ్యక్తి యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ అని వెల్లడైంది. ఆపై ధైర్యంతో ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేయడంతో దొంగగా మారిన పోలీసు దొరికిపోయాడు. ద్విచక్ర వాహనంలో వచ్చినవారిలో ఒకరు కానిస్టేబుల్ కాగా సాధారణ దుస్తుల్లో మరో వ్యక్తి ఏఎస్ఐగా గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read: తీవ్ర సంచలనంగా మారిన గుంటూరు జిల్లా గ్యాంగ్ రేప్ ఘటన.. మరీ ఇంత దారుణమా.. భర్తను కట్టేసి.. భార్యపై

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన గణేష్‌ పండుగ సందడి.. కోవిడ్ నిబంధనలు మాత్రం మస్ట్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే