Gang Rape: తీవ్ర సంచలనంగా మారిన గుంటూరు జిల్లా గ్యాంగ్ రేప్ ఘటన… మరీ ఇంత దారుణమా.. భర్తను కట్టేసి.. భార్యపై

గుంటూరు జిల్లాలో మరోసారి ఉన్మాదులు. రాత్రి సమయంలో దారిలో వెళ్తున్న భార్యభర్తలను అటకాయించి... వారిపై దాడి చేశారు. అనంతరం భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు.

Gang Rape: తీవ్ర సంచలనంగా మారిన గుంటూరు జిల్లా గ్యాంగ్ రేప్ ఘటన... మరీ ఇంత దారుణమా..  భర్తను కట్టేసి.. భార్యపై
Gang Rape

గుంటూరు జిల్లాలో వివాహితపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరానికి 28 కి.మీ దూరంలో.. మేడికొండూరు మండలం పాలడుగు వద్ద బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అత్యంత ఆటవికంగా దుండగులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల ముఠా తరహాలో మాటువేసిన ఆగంతకులు.. భార్యాభర్తలు ఇద్దర్నీ తీవ్రంగా కొట్టి.. చిత్రహింసలు పెట్టారు. ఉన్మాదులుగా మారి.. భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు. వేటకొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా కాజేశారు.  సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద మూడు నెలల కిందట జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరవకముందే.. అదే తరహా దారుణం అదే జిల్లాలో చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే…

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు (భార్య 26, భర్త 30 ఏళ్లు) బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9.45 గంటలకు సొంతూరుకి బయల్దేరారు. రెండున్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించాక.. దారికి అడ్డంగా వేసి ఉన్న ఓ చెట్టు కొమ్మ ఎదురుపడింది. దానిపై నుంచే బైక్‌ను ముందుకు పోనివ్వగా.. దుండగులు చక్రానికి కర్ర అడ్డంపెట్టి వాహనంపైనుంచి వారిద్దరినీ కిందపడగొట్టారు. వెంటనే ఇద్దరిపై అటాక్ చేసి తీవ్రంగా గాయపరిచారు. తర్వాత కొడవళ్లు చూపించి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సమీపంలోని పొలాల్లోకి వారిని తీసుకెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారికి డౌట్ రాకుండా బాధితుల బైకును పొలాల్లోకి దించేశారు. బాధితురాలి భర్త బనియను, దుస్తుల్ని చించేసి వాటితోనే అతన్ని కట్టేశారు. అతని వద్ద ఇద్దరు దుండగులు కాపలా కాయగా, మరో ఇద్దరు బాధితురాల్ని ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రాత్రి 12.40 గంటల వరకూ భార్యాభర్తలిద్దరినీ తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం నలుగురు ఉన్మాదులు బాధితురాలి మెడలోని మంగళసూత్రం, చెవిదుద్దులు, వెండి కాళ్లపట్టీలు, రూ.5 వేల డబ్బు దోచుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కొడవళ్లు చూపించి బెదిరించారు. ఎవరికీ చెప్పబోమని బాధితులు అన్న తర్వాతే విడిచిపెట్టి పరారయ్యారు. ఆ సమయంలో ఓ ఫోన్‌ నంబర్‌ కూడా బాధితులకు ఇచ్చారు. దాన్ని పరిశీలించగా, అది మధ్యప్రదేశ్‌కు చెందిన నంబర్‌గా తేలింది. ఆగంతుకుల్లో ముగ్గురు తెలుగులో మాట్లాడారని.. ఓ వ్యక్తి మాత్రమే వేరే భాషలో మాట్లాడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. వారంతా ముఖాలకు మాస్కులు పెట్టుకున్నట్లు చెప్పారు.

పోలీసుల అదుపులో 8  మంది అనుమానితులు

గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎనిమిది పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికే 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా వారిని విచారిస్తున్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భయం లేకనేనా…

ఇటువంటి ఘటనలు ఎక్కువగా నార్త్ సైడ్ జరుగుతుంటాయి. సౌత్ అందునా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి క్రైమ్స్‌ చేసినవాళ్లకి ఎలాంటి గుణపాఠాలు ఎదురయ్యాయో అందరం చూశాం. కానీ ఏపీలోని గుంటూరు జిల్లాలో మూడు నెలల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు రెండు జరగడం మాత్రం ప్రభుత్వం కాస్త సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సిన అంశంగానే కనిపిస్తోంది.

Also Read:  ఫిట్​నెస్​ నిపుణుడుతో పరిచయం, ప్రేమ, పెళ్లి.. లేడీ కమెడియన్ మ్యారేజ్ ఫోటోలు వైరల్

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన గణేష్‌ పండుగ సందడి.. కోవిడ్ నిబంధనలు మాత్రం మస్ట్

 

Click on your DTH Provider to Add TV9 Telugu