Vinayaka Chaviti: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన గణేష్‌ పండుగ సందడి.. కోవిడ్ నిబంధనలు మాత్రం మస్ట్

వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతోంది. మట్టి వినాయకుడిని పూజిద్దాం- పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ టీవీ9 ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన లభిస్తోంది.

Vinayaka Chaviti: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన గణేష్‌ పండుగ సందడి.. కోవిడ్ నిబంధనలు మాత్రం మస్ట్
Lord Ganesh
Follow us

|

Updated on: Sep 10, 2021 | 7:51 AM

తెలుగు రాష్ట్రాల్లో గణేష్‌ పండుగ సందడి నెలకొంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బొజ్జగణపయ్యలను కొలువుదీరుస్తున్నారు భక్తులు. పలు స్వచ్చంధ సంస్థలు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, గవర్నర్లు తెలుగు ప్రజలకు వినాయచవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఉదయం 11.30 గంటలకు ఖైరతాబాద్‌ గణపతికి తొలిపూజ

ఖైరతాబాద్‌ వినాయకుడు కొలువుదీరాడు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఎమ్మెల్యే రోజా వినాయచవితి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు వినాయచవితి శుభాకాంక్షలు తెలిపారు నగరి MLA ఆర్‌.కె.రోజా. కుటుంబ సభ్యులంతా కలిసి మట్టి వినాయక విగ్రహాలను ఇంట్లోని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ…థర్డ్‌వేవ్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు రోజా.

నిబంధనలు పాటించాలని ఏపీ హైకోర్టు సూచన

గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేసింది ఏపీ హైకోర్టు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని ఆదేశించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించింది.

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై ఆంక్షలు విధించిన హైకోర్టు తీర్పుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిఫరెంట్ గా రియాక్టయ్యారు. హైకోర్టు ఆంక్షలపై నాలుగేళ్లుగా కోర్టు ఇవే ఆంక్షలు విధిస్తుంటే… ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం ఏ చేస్తోందని రాజాసింగ్‌ ప్రశ్నించారు.

టీవీ-9 స్ఫూర్తితో పలు చోట్ల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

టీవీ-9 స్ఫూర్తితో కర్నూలుజిల్లా ఆదోనిలో RRG స్వచ్చంధసేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. స్థానిక వీరశైవ కళ్యాణమంటపంలో సుమారు 2 వేలకుపైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్వచ్చంధ సేవా సంస్థ నిర్వాహకుడు తిమ్మనగౌడ్‌ తెలిపారు.

మహబూబ్‌నగర్‌ ఉమ్మడిజిల్లాలో మట్టివినాయకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కొత్తకోట, చిన్నచింతకుంటలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విత్తన గణేష్‌ విగ్రహాలను పంపిణీ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్‌ మంచి కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు MLA ఆల వెంకటేశ్వర్‌రెడ్డి.

విజయనగరంలో పెద్దఎత్తున మట్టి విగ్రహాలు పంపిణీ చేశాయి స్వచ్చంద సంస్థలు. హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని…కాలుష్య కారకలైన విగ్రహాలను వాడొద్దని సూచించారు.

Also Read:ఫిట్​నెస్​ నిపుణుడుతో పరిచయం, ప్రేమ, పెళ్లి.. లేడీ కమెడియన్ మ్యారేజ్ ఫోటోలు వైరల్