Cheating: రైస్ పుల్లింగ్ పేరిట దేశవ్యాప్తంగా మోసాలు… మొదట తాను మోసపోయి.. ఆపై మోసాలకు పూనుకుని.. చివరకు
రైస్ పుల్లింగ్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజలను మోసగిస్తున్న ఢిల్లికి చెందిన ప్రధాన నిందితుడు, సూత్రధారి సిధ్ధార్ద జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
రైస్ పుల్లింగ్ పేరుతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలను మోసగిస్తున్న మోస్ట్ వాంటెడ్ చీటర్ రాజస్థాన్ రాష్ట్రం జయపురకు చెందిన సిద్ధార్థ జైన్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న ఇతడిని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఇతని అనుచరుడైన తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మద్దూరుకు చెందిన షేక్ మున్నా అలియాస్ ఎస్‌కే మున్నాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట తాను ఇదే విధంగా 25 లక్షలు మోసపోయానని, తర్వాత ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు సిద్ధార్థ జైన్ విచారణలో చెప్పినట్లు కర్నూలు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో మున్నాను, కర్ణాటక రాష్ట్రం దావనగిరికి చెందిన ఆదర్శ బసవలను ఏజెంట్లుగా జైన్ నియమించుకున్నాడు. సిద్ధార్థ జైన్ వీరిద్దరి ద్వారా కర్నూలు బాలాజీ నగర్ కు చెందిన కాజా వద్ద 1.25 కోట్లు, పింజరి మా భాష వద్ద 25 లక్షలు, శేఖన్న వద్ద 2.8 కోట్లు, మహబూబ్ బాషా వద్ద 3.6 కోట్ల చొప్పున దోచుకున్నాడు. మూడు పోలీస్ స్టేషన్లలో అతనిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎస్ కే మున్నా కూడా అరెస్టయ్యాడు. మిగిలిన ఆదర్శ బసవతో పాటు మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని కర్నూలు డీఎస్పీ మహేష్ తెలిపారు.
సిద్దార్థ్ జైన్ మోసాల చిట్టా ఇదే…
రైస్ పుల్లింగ్ పేరిట మోసాలకు తెరలేపిన వ్యక్తి రాజస్థాన్ రాజధానిజయపురకు చెందిన సిద్దార్థ జైన్ (41). ఢిల్లీలో నివాసం ఉంటూ రైస్ పుల్లింగ్ పేరిట అమాయకులను బురిడీ కొట్టడం ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా, మహరాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రైస్ పుల్లింగ్ పేరిట ఛీటింగ్ చేస్తున్నాడు. డిల్లీకి చెందిన యూనివర్సల్ ట్రేడ్ కంపెని అధినేత అయిన సిధ్దార్ద్ జైన్ తమ వద్ద రైస్ పుల్లింగ్ మెషీన్ ఉందని దానిని.. రాకెట్, శాటి లైట్ లలో ఉపయోగిస్తారని…. దాని విలువ వెయ్యి కోట్లు ఉంటుందని, దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 100 కోట్ల వరకు రుణం కూడా ఇస్తారని, ఆ రైస్ పుల్లింగ్ కోటి రూపాయలకు ఇస్తామని చెప్పేవారు. అంతే కాదు ఆ రైస్ పుల్లింగ్ యంత్రం చూడాలంటే ఒక జాకెట్ కావాలని… ఆ జాకెట్ విలువ 30 లక్షలు ఉంటుందని.. ఆ జాకెట్ వేసుకోకుండా రైస్ పుల్లింగ్ వద్దకు వెళితే రక్తం కక్కి చనిపోతారని చెప్పి… ఆ రైస్ పుల్లింగ్ యంత్రానికి మహిమలు(శక్తులు) ఉన్నాయని పలు రకాలుగా నమ్మించేవారు. తేలిగ్గా పదింతల డబ్బు వస్తుందనే ఆశతో వీరి వలకు చిక్కిన వారిని మోసం చేసి ఎస్కేప్ అయ్యేవారు.
Also Read: దొంగగా మారిన కానిస్టేబుల్.. యూనిఫామ్‌లోనే దుస్తులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు