Khiladi Movie : రవితేజ ఖిలాడి మూవీ నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట
క్రాక్ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చిన రవితేజ. అదే జోష్‌లో వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెల్సిందే. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Khiladi Movie : క్రాక్ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చిన రవితేజ. అదే జోష్‌లో వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెల్సిందే. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి ఆకట్టుకున్నాడు మాస్ రాజా. ఈ సినిమా తరవాత రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవి తేజ. ఈ సినిమా ఖిలాడి అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో డింపుల్ హయతి. మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న రవితేజ ఖిలాడీపై.. ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మిగతా 10 శాతం షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నారు మేకర్స్.
యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ కేద్కర్ .. రావు రమేశ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ప్రత్యేకమైన పాత్రలో అనసూయ మెరవనుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. తాజాగా ఈ సినిమానుంచి అందమైన మెలోడీని విడుదల చేశారు. ఇష్టం అంటూ సాగే పాటను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ మెలోడీ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రీమణి అందమైన సాహిత్యం అందించగా.. హరిప్రియ అద్భుతంగా పాడారు. ఇప్పుడు ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :