Actress : అందంగా లేదని తిట్టారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. ఇప్పుడు వరుస వివాదాల్లో..
సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటున్నారు. మరోవైపు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రపంచంలో ఒకటి రెండు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. హిందీ, తమిళం, మలయాళం భాషలకు చెందిన తారలు తెలుగులో సత్తా చాటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మడు.. తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లోనే నటించింది. కానీ ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇప్పుడు మాత్రం వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా. ? తనే హీరోయిన్ శిల్పా శెట్టి.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
పైన ఫోటోలో శిల్పా సెట్టి తన స్నేహితులతో కలిసి స్కూల్ యూనిఫాంలో ఫోజులిచ్చింది. మధ్యలో వెనుక వరుసలో ఉన్న వైట్ డ్రెస్ అమ్మాయే శిల్పా శెట్టి. ఆమె తన చదువును చెంబూర్‌లోని సెయింట్ ఆంథోనీ గర్ల్స్ హై స్కూల్, మతుంగాలోని పోడార్ కాలేజీలో పూర్తి చేసింది. 1991లో లిమ్కా టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటించింది. ఆ సమయంలోనే ఆమె మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1993లో అబ్బాస్-ముస్తాన్ థ్రిల్లర్ బాజిగర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా ప్రధాన పాత్రలో నటించారు.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..
తెలుగులో వెంకటేశ్ సరసన సాహసవీరుడు సాగరకన్య చిత్రంలో నటించింది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆమె చివరిసారిగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన హంగామా 2 చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటుంది. అలాగే ఇటీవల కొన్ని రోజులుగా శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా పలు వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..




