AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 18 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. 20 ఏళ్లకే స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు రజినీకాంత్, అజిత్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్..

ప్రస్తుతం సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. చూడచక్కని రూపం.. ఆకట్టుకునే సౌందర్యం.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమిళం, మలయాళం భాషలలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ హీరోయిన్.. ఇప్పుడు కుర్ర భామలకు సైతం టెన్షన్ పుట్టిస్తోంది.

Tollywood: 18 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. 20 ఏళ్లకే స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు రజినీకాంత్, అజిత్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్..
Manju Warrier
Rajitha Chanti
|

Updated on: Sep 18, 2025 | 12:10 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. 18 ఏళ్లకే తోపు హీరోయిన్ గా సినీరంగంలో చక్రం తిప్పిన ఆమె..20 ఏళ్లకే ఓ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమై పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ గడిపేసింది. కట్ చేస్తే 18 ఏళ్లకు రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అంతేకాదు.. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ కుర్ర భామలకు షాకిస్తుంది. ఆమె మరెవరో కాదు.. మలయాళీ హీరోయిన్ మంజు వారియర్. ఆమె స్కూల్ డేస్ ఫోటో అది. స్కూల్ యూత్ ఫెస్టివల్‌లో కళాతిలక అవార్డు గెలుచుకున్న మంజు, 1995లో విడుదలైన సాక్షియం చిత్రంలో తొలిసారిగా నటించింది. తరువాత, సుందర్ దాస్ దర్శకత్వం వహించిన సల్లపం చిత్రంలో కథానాయికగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఇవి కూడా చదవండి

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుండి నేషనల్ టాలెంట్ సెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కాలర్‌షిప్ (భరతనాట్యం) అందుకున్నప్పుడు వార్తాపత్రికలలో ప్రచురితమైన వార్తను మంజు పంచుకున్నారు. 1995 లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంజు, త్వరగా మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటిగా ఎదిగింది. ఆమె కేవలం నాలుగు సంవత్సరాలలో దాదాపు ఇరవై సినిమాలు చేసింది. కెరీర్ ఫాంలో ఉండగానే నటుడు దిలీప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం 1998లో జరిగింది. ఆ తర్వాత ఆమె సినిమాకు పూర్తిగా దూరమయ్యింది. ఆమె కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు, ఇప్పటికే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత తన భర్త కోసం సినిమాలకు దూరమైంది.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

కానీ తన భర్త చేతిలోనే మోసపోయింది. వేరే నటితో దిలీప్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని తెలిసి అతడితో విడాకులు తీసుకుంది. దాదాపు 18 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మంజు ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తమిళలో అజిత్, సూపర్ స్టార్ రజినీకాంత్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 47 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్‌నెస్ తో కట్టిపడేస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..