Ajith Kumar: అజిత్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాను తొలగించిన నెట్‌ఫ్లిక్స్.. కారణమిదే
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులకు నెట్ ఫ్లిక్స్ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను తమ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించింది. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీ అందుబాటులో లేదు.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ మూవీ ఓటీటీలో రాగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమాను ఓటీటీలో చాలా రోజులు చూసి ఆనందించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా నెట్‌ఫ్లిక్స్ అజిత్ సినిమాను తొలగించింది. కాపీరైట్ ఉల్లంఘన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు తలనొప్పిగా మారింది. కాపీరైట్ ఉల్లంఘన జరిగితే, చట్టం ప్రకారం అటువంటి సినిమాల ప్రసారాన్ని నిలిపివేయడం అనివార్యం అవుతుంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ప్రసార హక్కులను కలిగి ఉన్న నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ నిబంధనలకు తలొగ్గి అజిత్ సినిమా స్ట్రీమింగ్ ను నిలిపివేసింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో ఇళయరాజా పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంతోనే ఇళయరాజా 5 కోట్ల రూపాయలు చెల్లించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత సినిమా దర్శక నిర్మాతలపై కేసు కూడా పెట్టారు.
ఆ పాటలను ఉపయోగించడానికి తమకు అనుమతి ఉందని నిర్మాతలు వాదించారు. కానీ వారు సరైన డాక్యుమెంటేషన్ అందించలేదు. కాబట్టి మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా ప్రసారాన్ని అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. దీని ప్రకారం , ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించారు.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. అజిత్ కుమార్, త్రిష, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, సునీల్, షైన్ టామ్ చాకో, టిను ఆనంద్, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ప్రస్తుతం, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ OTTలో వీక్షించడానికి అందుబాటులో లేదు
Mythri: Since ‘Good Bad Ugly’ was taken down from Netflix, it has become a big problem for us. After the OTT premiere, how can the songs be removed? If changes are needed, we will have to apply for re-censoring, the production house told the High Court. 🫨😳 pic.twitter.com/NFPmskCoqJ
— KARTHIK DP (@dp_karthik) September 17, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








