Tollywood: అప్పట్లో శ్రీదేవి గట్టి పోటీ ఇచ్చిన హీరోయిన్.. తెలుగులో సూపర్ హిట్స్ చేసిన అందాల తార ఎవరో గుర్తుపట్టండి..
బాలీవుడ్, టాలీవుడ్ భాషతో సంబంధం లేకుండా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన దివంగత హీరోయిన్ శ్రీదేవికి గట్టి పోటినిచ్చింది. అందమైన రూపం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ కథానాయికకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.
పైన ఫోటోలో అమాయకపు చూపులతో కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉండేది. బాలీవుడ్, టాలీవుడ్ భాషతో సంబంధం లేకుండా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన దివంగత హీరోయిన్ శ్రీదేవికి గట్టి పోటినిచ్చింది. అందమైన రూపం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ కథానాయికకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవితో ఆ హీరోయిన్ నటించిన సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఆ చిత్రంలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్. తనే సినీయర్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి.
అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న శ్రీదేవికి పోటీ ఇచ్చింది మీనాక్షి. అందం.. ఆకట్టుకునే డాన్స్ ప్రేక్షకులను మైమరపించింది. పదిహేడేళ్ల వయసులో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకుంది. అతి చిన్న వయసులో ఈ కిరీటం అందుకున్న పిన్న వయస్కురాలిగా రికార్డ్ సొంతం చేసుకుంది. 1983లో ఆమె అశోక్ V దర్శకత్వం వహించిన పెయింటర్ బాబు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయిన మీనాక్షి తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే. 1992లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆపద్భాంధవుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ఆమె నటనకు .. డాన్స్ కు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించింది. తాజాగా మీనాక్షి చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. పెళ్లి తర్వాత మీనాక్షి సినిమాలకు పూర్తిగా దూరమైంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.