Actor: అమ్మాయిల డ్రీమ్ బాయ్.. అందంలో సరిలేరు అతడికి.. ఫాలోయింగ్ చూస్తే అంతే ఇక..
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది మధురమైన జ్ఞాపకం. చిన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తీసిన ఫోటోస్, వీడియోలను ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలనే సోషల్ మీడియాలో పంచుకుంటూ మరోసారి ఆ మధురానుభూతిని గుర్తు చేసుకుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. ? ప్రపంచవ్యాప్తంగా ఆ కుర్రాడికి విపరీతమైన క్రేజ్ ఉంది. 50 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ ఫిట్నెస్, మూవీస్ విషయంలో కుర్రహీరోలకు గట్టిపోటినిస్తున్నాడు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో కనిపించాడు. అతడి తండ్రి సూపర్ స్టార్. తండ్రి నుంచే నటన, క్రమశిక్షణ, సేవాగుణాన్ని వారసత్వంగా తీసుకున్నారు. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా అతడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.
ఇవి కూడా చదవండి : Cinema : ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ మామ.. 30 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్..
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ముఖ్యంగా వేలాది మంది చిన్నారుల ప్రాణాలు కాపాడారు. అతడు మరెవరో కాదండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు. హీరో కృష్ణ వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. నడీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మహేష్.. ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం వంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించారు. రాజకుమారుడు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
2003లో వచ్చిన ఒక్కడు సినిమాతో మాస్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.ఈ సినిమాకు నంది అవార్డ్ అందుకున్నారు. ఇక మహేష్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా పోకిరి. ఈ మూవీతో రికార్డ్స్ బద్దలుకొట్టాడు. ఆ తర్వాత వరుస హిట్లతో సత్తా చాటారు. చివరిగా గుంటూరు కారం చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..








