OTT Movie: పరాయి పురుషులకు ముఖం చూపిస్తే ఆత్మాహుతి చేసుకోవాల్సిందే..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా
సాధారణంగా సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాక సుమారు నెల రోజులకు ఓటీటీలో వస్తుంటాయి. మరికొన్ని 45 రోజలు, ఇంకొన్ని రెండు నెలల్లోపు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే ఈ మూవీ మాత్రం థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా..

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (సెప్టెంబర్12) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లోకి అందుబాటులోకి వచ్చేశాయి. ఇందులో రెండు వారాల క్రితమే థియేటర్లలో రిలీజైన ఒక తెలుగు సినిమా కూడా ఉంది. బిగ్ స్క్రీన్ పై ఓ మోస్తరుగా ఆడిన ఈ డిఫరెంట్ మూవీ ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో ఇలాంటి స్టోరీతో సినిమా రాలేదని చెప్పవచ్చు.. పడతి అనే ఊరు. అక్కడ మహిళలంతా తమ ముఖం బయటకు కనిపించకుండా పరదాలు వేసుకుని తిరుగుతుంటారు. ఇంట్లో తండ్రికి తప్పితే పరాయి పురుషులకకు వాళ్ల ముఖాలు అసలు చూడకూడదు. ఒక వేళ అలా చూపిస్తే ఊరికి అరిష్టం దాపరిస్తుందని గ్రామస్తుల నమ్మకం. అంతే కాదు పిల్లలు పుట్టకుండా పురిటిలోనే చనిపోతారని ఈ ఊరి లు బలంగా నమ్ముతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే ఊరిలో పుట్టి పెరిగిన సుబ్బులక్ష్మి అదే ఊళ్లోని రాజేష్ ని చూసి ఇష్టపడుతుంది. ఇద్దరి మనసులు కలవడంతో నిశ్చితార్థం చేసుకోవాలనుకుంటారు. అయితే ఇంతలో పరదా లేని సుబ్బు ఫొటో ఒకటి బయటకు వస్తుంది. సుబ్బు ఆత్మాహుతి చేసుకోవాలని గ్రామస్తులంతా నిర్ణయిస్తారు.
మరి సుబ్బు తాను తప్పుచేయలేని నిరూపించుకునేందుకు ఏం చేసింది? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరిలో అమలవుతోన్న ఈ కఠినమైన కట్టుబాట్ల వెనక ఉన్న కథేమిటి? ఈ చిక్కుల్లో నుంచి సుబ్బు బయట పడిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పేరు పరదా. మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఇందులో లీడ్ రోల్ పోషించింది. రాగ్ మయూర్, సంగీత, దర్శన రాజేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా బండి, శుభం సినిమాల దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో డిఫరెంట్ సినిమాలను ట్రై చేయాలనుకునేవారికి పరదా సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
🔔 Telugu movie #Paradha (2025) now streaming on Prime Video.
Starring – Anupama Parameswaran, Darshana Rajendran & Sangeetha.
Audios – Telugu (original) & Tamil. pic.twitter.com/ZouEdLZnfo
— Ott Updates (@Ott_updates) September 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








