Tollywood: వామ్మో! ఇదేం మేకోవర్! ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఈ హీరోయిన్ తెలుగులో ఇప్పటివరకు చేసింది కేవలం ఒకే ఒక్క సినిమానే. కానీ క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవెల్. గత కొన్ని రోజులగా ఈ ముద్దుగుమ్మ పేరు బాగా ట్రెండింగ్ లో ఉంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫాలోయింగ్ మామలుగా లేదు.

పై ఫొటోలో మాములుగా సాదా సీదాగా న్యాచురల్ లుక్ లో క్యూట్ గా కనిపిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒక టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో ఆమె ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాల్లో నటించింది. సినిమా కథలకు తగ్గట్టుగా కేవలం ట్రెడిషినల్ లుక్ లోనే కనిపించింది. అయితేనేం అభినయం పరంగా అందరినీ ఆకట్టుకుంది. కానీ పోనూ పోనూ ఈ ముద్దుగుమ్మ కూడా కిర్రాక్ లుక్‌లోకి మారిపోయింది. గ్లామరస్ రోల్స్ కు సై అంది. అలా ఈ శుక్రవారం (మార్చి 28) ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక తెలుగు సినిమా రిలీజ్ కానుంది. అలాగనీ అందులో ఆమె మెయిన్ హీరోయిన్ కాదు. జస్ట్ ఒక స్పెషల్ సాంగ్స్ లో నటించింది. కానీ గత కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తోంది. పండగలు, పబ్బాలు, వివాహ వేడుకలు.. ఇలా ఎక్కడ చూసినా ఈ పాట ఉండాల్సిందే. అందులో ఈ హీరోయిన్ వేసిన స్టెప్పులు అలాంటివి మరి.. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్..ఈ క్యూటీ మరెవరో కాదు గత కొన్ని నెలలుగా ‘స్వాతి రెడ్డి’ పాటతో ట్రెండింగ్ లో ఉంటోన్న రెబా మెనికా జాన్. ఆమె స్పెషల్ సాంగ్ లో నటించిన మ్యాడ్ స్క్వేర్ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోరెబా మోనికకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
2016లో జకబింటే స్వర్గరాజ్యం అనే ఒక మలయాళం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రెబా మోనికా జాన్. ఆ తర్వాత పలు తమిళ్ సినిమాల్లోనూ నటించింది. ఫోరెన్సిక్, జరుగండి, బిగిల్, మైఖేల్, ఎఫ్.ఐ.ఆర్, బూ తదితర హిట్ సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో సామజవరగమన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది.
రెబా మోనికా జాన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
ప్రస్తుతం రెబా మోనికా జాన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీ విష్ణు సరసన ‘మృత్యుంజయ్’, రజనీకాంత్ కూలీ, విజయ దళపతి జన నాయగన్ తదితర సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్రలు పోషిస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.