Tollywood: అద్భుతమైన గాత్రంతో మైమరపిస్తున్న సింగర్.. అందంలో హీరోయిన్లు సైతం దిగదుడుపే..
అద్భుతమైన గానంతో సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, పంజాబి భాషలలో అనేక పాటలు పాడి ఆకట్టుకుంటుంది. అమాయకపు చూపులతో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సింగర్. ఇటు కోయిల గానంతో ఫిదా చేస్తున్న ఈ బ్యూటీ..అటు అందంలో హీరోయిన్లకు సైతం పోటీనిస్తుంది. ఎవరో గుర్తుపట్టగలరా.. ? విజయ్ దళపతి నటించిచన బీస్ట్ సినిమాలో పాపులర్ అయిన అరబిక్ కుతు పాటను పాడిన అమ్మాయే ఈ చిన్నారి. గుర్తుపట్టగలరా.. ?
సినీపరిశ్రమలో ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. అద్భుతమైన గానంతో సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, పంజాబి భాషలలో అనేక పాటలు పాడి ఆకట్టుకుంటుంది. అమాయకపు చూపులతో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సింగర్. ఇటు కోయిల గానంతో ఫిదా చేస్తున్న ఈ బ్యూటీ..అటు అందంలో హీరోయిన్లకు సైతం పోటీనిస్తుంది. ఎవరో గుర్తుపట్టగలరా.. ? విజయ్ దళపతి నటించిచన బీస్ట్ సినిమాలో పాపులర్ అయిన అరబిక్ కుతు పాటను పాడిన అమ్మాయే ఈ చిన్నారి. గుర్తుపట్టగలరా.. ? తనే సింగర్ జోనితా గాంధీ. సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్యాన్ క్రేజ్ ఉన్న సింగర్ తనే. మ్యూజిక్ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని గాయని. నాలుగేళ్ల వయసులోనే సంగీతంపై ఆసక్తితో స్టేజ్ పై ప్రదర్శనలు ఇవ్వడం స్టార్ట్ చేసింది.
వెస్ట్రన్ అంటారియో యూనివర్సిటీలో రిచర్ట్ ఐవీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అకడమిక్ ఎక్సలెన్స్ ను కొనసాగిస్తూ బీహెచ్ఎస్సీ, హెచ్బీఏలను పూర్తి చేసింది. మరోవైపు గాయనిగా కెరీర్ కొనసాగిస్తుంది. మొదట్లో యూట్యూబ్ లో ఆల్బమ్ కవర్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది జోనితా గాంధి. ఆ తర్వాత బాలీవుడ్ టాప్ సింగర్ సోనూ నిగమ్ తో కలిసి పాడే అవకాశం అందుకుంది. ఆ తర్వాత జోనితా కెరీర్ టర్న్ అయ్యింది. 2013లో షారుఖ్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్లేబ్యాక్ సింగర్ గా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీలో అనేక పాటలు ఆలపించింది.
గుజరాతీ, హిందీ, పంజాబీ, మరాఠీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో అత్యధిక పాటలు పాడింది. తెలుగులో ఏకంగా 22 సినిమాల్లో పాటలు పాడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ కలిసి నటించిన మా.. మా మహేశా.. సాంగ్ ఆలపించింది. 1989 అక్టోబర్ 23న న్యూఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించిన జోనితా.. చిన్నప్పటి నుంచే సంగీతం పై మక్కువ పెంచుకుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే జోనితా .. నిత్యం లేటేస్ట్ స్టన్నింగ్ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. ప్రస్తుతం జోనితా లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.