Amitabh Bachchan: హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో సందడి చేసిన అమితాబ్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన డార్లింగ్ ఇప్పుడు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Amitabh Bachchan: హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో సందడి చేసిన అమితాబ్..
Amitabh Bachchan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 30, 2022 | 12:08 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన డార్లింగ్ ఇప్పుడు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహానటితో ప్రశంసలు అందుకున్న నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) మొదటిసారి నేరుగా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించబోతోంది. సైన్స్‌ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడిందంటూ రూమర్లు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై ప్రాజెక్ట్‌ కె చిత్రబృందం స్పందించింది. షూటింగ్‌ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో బిగ్ బి పాల్గొంటున్నారు. తాజాగా అమితాబ్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెట్రో స్టేషన్ లో జరిగే ఓ సన్నివేశంలో అమితాబ్ పాల్గొన్నారు.ట్రైన్‌ సీక్వెన్స్‌ కోసం మెట్రో స్టేషన్ కు వెళ్లిన ఆయనను ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. దీనికి సంబంధించిన పిక్ వైరల్ అవుతోంది. ఇక ‘వైజయంతి మూవీస్‌’ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన సంగతి తెలిసిందే. కార్యాలయ ప్రారంభోత్సవంలో రాఘవేంద్రరావు, అమితాబ్‌ బచ్చన్‌, ప్రశాంత్‌నీల్‌, ప్రభాస్‌, నాని, దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో కొన్నిరోజుల క్రితం నెట్టింట చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి
Bigg B

Bigg B

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి